క్రీడాభూమి

ఇంగ్లాండ్ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్, ఆగస్టు 25: ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఒక వికెట్ తేడాతో, సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 67 పరుగులకే కుప్పకూలి, ఘోర పరాజయం ముంగిట నిలిచిన ఈ జట్టును బెన్ స్టోక్స్ తన అజేయ శతకంతో గెలిపించాడు. ఐదు మ్యాచ్ సిరీస్‌లో ఇప్పుడు ఇరు జట్లు చెరొక విజయంతో సమవుజ్జీగా నిలిచాయి. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 179 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా ఇంగ్లాండ్ 67 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేయడం ద్వారా ఇంగ్లాండ్ ముందు 359 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. గతంలో ఇంగ్లాండ్ ఎన్నడూ టెస్టుల్లో ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించలేదు. 1928-29 సీజన్‌లో ఆస్ట్రేలియాను 332 పరుగులు చేసి ఓడించిన ఇంగ్లాండ్ ఈసారి ఏకంగా 359 పరుగులను పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. ఇలావుంటే, రెండో ఇన్నింగ్స్‌లో తొలుత కెప్టెన్ జో రూట్ (77), జో డెన్లీ (50) ఆతర్వాత స్టోక్స్ (135 నాటౌట్) తమ అసాధారణ ప్రతిభతో ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ నాలుగో రోజు మూడు వికెట్లకు 156 పరుగులు చేసిన ఇంగ్లాండ్, చివరిదైన ఐదో రోజు సర్వశక్తులు ఒడ్డింది. ఆట ప్రారంభమైన జో రూట్‌ను డేవిడ్ వార్నర్ క్యాచ్ అందుకోగా జొష్ హాజెల్‌వుడ్ ఔట్ చేశాడు. జో డెన్లీ 35 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. జొస్ బట్లర్ (1), క్రిస్ వోక్స్ (1), జొఫ్రా ఆర్చర్ (15), స్టువర్ట్ బ్రాడ్ (0) తక్కువ స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ, స్టోక్స్ పోరాటం ఇంగ్లాండ్‌ను గెలిపించింది. ఆ జట్టు 125.4 ఓవర్లలో 9 వికెట్లకు 362 పరుగులు చేసి విజయం సాధించే సమయానికి స్టోక్స్‌తోపాటు జాక్ లీచ్ (1) నాటౌట్‌గా ఉన్నాడు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 52.1 ఓవర్లలో 179 ఆలౌట్ (డేవిడ్ వార్నర్ 61, మాముస్ లబుషేన్ 74, జొఫ్రా ఆర్చర్ 6/45, స్టువర్ట్ బ్రాడ్ 2/32, క్రిస్ వోక్స్ 1/51, బెన్ స్టోక్స్ 1/45).
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 27.5 ఓవర్లలో 67 ఆలౌట్ (జో డెన్లీ 12, జొష్ హాజెల్‌వుడ్ 5/30, పాట్ కమిన్స్ 3/23, జేమ్స్ పాటిన్సన్ 2/9).
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 75.2 ఓవర్లలో 246 ఆలౌట్ (ఉస్మాన్ ఖాజా 23, మార్నస్ లబుషేన్ 80, ట్రావిస్ హెడ్ 25, మాథ్యూ వేడ్ 33, జేమ్స్ పాటిన్సన్ 20, బెన్ స్టోక్స్ 3/56, జొఫ్రా ఆర్చర్ 2/40, స్టువర్ట్ బ్రాడ్ 2/52).
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 3 వికెట్లకు 156): 125.4 ఓవర్లలో 9 వికెట్లకు 362 (జో రూట్ 77, జో డెన్లీ 50, బెన్ స్టోక్స్ 135, జానీ బెయిర్‌స్టో 36, జొష్ హాజెల్‌వుడ్ 4/85, నాథన్ లియాన్ 2/114, పాట్ కమిన్స్ 1/80).
చిత్రం... అజేయ శతకంతో ఇంగ్లాండ్‌ను గెలిపించిన బెన్ స్టోక్స్