క్రీడాభూమి

అమ్మకు అంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసెల్ : ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో తాను సాధించిన మహిళల సింగిల్స్ స్వర్ణ పతకాన్ని తన తల్లికి అంకితం ఇస్తున్నట్టు పీవీ సింధు ప్రకటించింది. తన తల్లి విజయ పుట్టిన రోజునే తాను విశ్వవిజేతగా నిలవడం ఆనందంగా ఉందని నవోమీ ఒసాకాను ఫైనల్లో ఓడించి, టైటిల్ సాధించిన ఆమె తెలిపింది. తన ఎదుగుదలో కీలక పాత్ర పోషించిన తల్లికి పుట్టిన రోజు కానుకగా టైటిల్‌ను అంకితం ఇస్తున్నానని, ఇదే ఆమెకు తానిచ్చే బహుమతి అని సింధు పేర్కొంది. ఆరేళ్లకే బాడ్మింటన్ ర్యాకెట్ పట్టుకొని కోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టిన సింధుకు తల్లిదండ్రులే స్ఫూర్తి ప్రదాతలు. తండ్రి పివి రమణ, తల్లి విజయ మాజీ వాలీబాల్ ప్లేయర్లే కావడం విశేషం. రమణ అర్జున అవార్డును కూడా స్వీకరించాడు. వారి అడుగు జాడల్లోనే నడిచిన సింధు కూడా మేటి క్రీడాకారిణిగా ఎదిగింది.
ఎన్నో రికార్డులు
సింధు ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు తొలిసారి పతకాన్ని ఆమె అందించింది. 2013లో గాంగ్జూలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి, ఈ మెగా టోర్నీలో ఒక పతకాన్ని అందుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. 2014లోనూ మరోసారి కాంస్య పతకంతో రాణించింది. ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ ఫైనల్ చేరిన మొదటి భారతీయురాలిగా ఆమె మరో రికార్డును నెలకొల్పింది. ఇండివిడ్యువల్ ఈవెంట్‌లో దేశానికి మొదటిసారి రజత పతకాన్ని సాధించిపెట్టిన మొదటి క్రీడాకారిణి కూడా ఆమే. 2017 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో మరోసారి ఆమె అద్వితీయ ప్రతిభ కనబరచింది. ఫైనల్ వరకూ చేరి, టైటిల్ పోరులో నొజోమీ ఒకుహరా చేతిలో 19-21, 22-20, 20-22 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. అయితే, భారత్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని సాధించిపెట్టిన బాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు పుస్తకాల్లో చోటు దక్కించుకుంది. 2018లో మరోసారి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఫైనల్ చేరింది. కానీ, ఒలింపిక్స్‌లో తనకు స్వర్ణం లభించకుండా అడ్డుకున్న కరోలినా మారిన్ మరోసారి ఆమె దూకుడుకు కళ్లెం వేసింది. 21-19, 21-10 తేడాతో మారిన్ విజయం సాధించడంతో, సింధు రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. కాగా, ఈసారి ఇదే టోర్నీ ఫైనల్లో ఒకాసాను చిత్తుచేసి స్వర్ణ పతకాన్ని సాధించింది. రెండేళ్ల క్రితం తనకు ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.
18 ఏళ్లకే అర్జున
సింధు కేవలం 18 ఏళ్ల వయసులోనే అర్జున అవార్డును అందుకుంది. 2013లో ఆమెకు ఈ అవార్డు లభించింది. రెండేళ్ల తర్వాత, 2015లో ఆమె దేశ అత్యున్నత పురస్కారాల్లో నాలుగోదైన పద్మశ్రీ అవార్డును స్వీకరించింది. రియో ఒలింపిక్స్‌లో పతకం ఆమెను క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్నకు అర్హురాలిగా చేసింది. 2016లో ఆమె ఖేల్ రత్న అవార్డును తీసుకుంది.
మార్గదర్శి గోపీచంద్
సింధు చిన్నతనంలో ర్యాకెట్ పట్టుకున్నప్పుడే గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్నాడు. బాడ్మింటన్‌లో ఎదుగుతున్న కొద్దీ గోపీచంద్ మాదిరే పేరు తెచ్చుకోవాలన్న పట్టుదల ఆమెలో పెరిగింది. అతని మార్గదర్శిగా ఎంచుకొని ప్రాక్టీస్ చేసింది. మొదట మెహబూబ్ అలీ, గోవర్ధన్ రెడ్డి, ఎస్‌ఎం ఆరిఫ్ పర్యవేక్షణలో ఆటకు మెరుగులు దిద్దుకుంది. ఆ తర్వాతో గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడెమీలో చేరింది. అక్కడే అంతర్జాతీయ మేటి క్రీడాకారిణిగా తనను తాను మలచుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో టైటిల్ సాధించి, గోపీచంద్‌కు నిజమై న గురుదక్షణను సమర్పించుకుంది. భారత బాడ్మింటన్‌లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.
చిత్రం... ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ పురుషుల విభాగంలో కాంస్య పతకం సాధించిన సాయ ప్రణీత్,
జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో మహిళల సింగిల్స్ విజేత పీవీ సింధు.