క్రీడాభూమి

క్విటోవా, సఫరోవా ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 27: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి 10వ సీడ్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా, 11వ సీడ్ క్రీడాకారిణి లూసీ సఫరోవా నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో క్విటోవా 0-6, 7-6, 0-6 తేడాతో అన్‌సీడెడ్ క్రీడాకారిణి షెల్బీ రోజెర్స్ చేతిలో పరాజం పాలవగా, ఆస్ట్రేలియాకు చెందిన 21వ సీడ్ క్రీడాకారిణి సమంతా స్టోసర్ 6-3, 6-7, 7-5 తేడాతో సఫరోవాకు చెక్ పెట్టింది. కాగా, మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌లలో రెండో సీడ్ క్రీడాకారిణి అగ్నేస్కా రద్వాన్‌స్కాతో పాటు నాలుగో సీడ్ గార్బిన్ ముగురుజా, ఆరో సీడ్ సిమోనా హాలెప్, 13వ సీడ్ స్వెత్లానా కుజ్నెత్సొవా, 25వ సీడ్ ఇరినా కమెలియా బెగు తమతమ ప్రత్యర్థులపై గెలుపొంది నాలుగో రౌండ్‌లో ప్రవేశించారు. రద్వాన్‌స్కా 6-2, 6-7, 6-2 తేడాతో 30వ సీడ్ బార్బోరా స్ట్రికోవాను, ముగురుజా 6-3, 6-0 తేడాతో యనినా విక్‌మేయర్‌ను, హాలెప్ 4-6, 6-2, 6-3 తేడాతో నవోమీ ఒసాకాను, కుజ్నెత్సొవా 6-1, 6-4 తేడాతో 24వ సీడ్ అనస్తాసియా పవ్‌లిచెన్కోవాను ఓడించగా, కమెలియా బెగు 6-4, 2-6, 6-1 తేడాతో అన్‌సీడెడ్ క్రీడాకారిణి అన్నికా బెక్‌పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ ఆటగాడు ఆండీ ముర్రేతో పాటు ఐదో సీడ్ కెయ్ నిషికోరి, ఎనిమిదో సీడ్ మిలోస్ రవోనిక్, తొమ్మిదో సీడ్ రిచర్డ్ గాస్కెట్ మూడో రౌండ్‌ను అధిగమించారు.
మూడో రౌండ్‌కు పేస్, బొపన్న
ఇదిలావుంటే, పురుషుల డబుల్స్ విభాగంలో భారత ఆటగాళ్లు లియాండర్ పేస్, రోహన్ బొపన్న తమతమ భాగస్వాములతో కలసి మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో ఆరో సీడ్ జోడీగా బరిలోకి దిగిన బొపన్న, ఫ్లోరియన్ మెర్గియా శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో రౌండ్ పోరులో 6-3, 6-4 సెట్ల తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన గ్రెగరీ బరెరీ, క్వెంటిన్ హాలిస్ జోడీని మట్టికరిపంచారు. అలాగే పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో 16వ సీడ్ లియాండర్ పేస్, మార్సిన్ మట్కోవ్‌స్కీ (పోలెండ్) జోడీ 6-4, 6-3 సెట్ల తేడాతో జూలియన్ నోలే (ఆస్ట్రియా), ఫ్లోరియన్ మేయర్ (జర్మనీ) జంటను చిత్తు చేసింది.