క్రీడాభూమి

హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఫైనల్‌కు జ్యోత్స్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, మే 27: హాంకాంగ్‌లో జరుగుతున్న పిఎస్‌ఎ హెచ్‌కెఎఫ్‌సి ఇంటర్నేషనల్ స్క్వాష్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి జోత్స్న చిన్నప్ప టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. ఈ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన జ్యోత్స్న శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్‌లో 8-11, 11-9, 12-10, 7-11, 11-9 తేడాతో హాంకాంగ్‌కు చెందిన డిఫెండింగ్ చాంపియన్ అనే్న అవును మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తైపీలో జరిగిన ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో కూడా అనే్నని ఓడించిన జ్యోత్స్నకు ఇటీవల ఆమెపై ఇది రెండో విజయం. ఈ విజయంతో జ్యోత్స్న కొన్ని కీలక పాయింట్లను తన ఖాతాలో జమ చేసుకుంది. పిఎస్‌ఎలో ఇప్పటివరకూ 11 టైటిళ్లు కైవసం చేసుకున్న జ్యోత్స్న శనివారం జరుగనున్న ఫైనల్‌లో న్యూజిలాండ్‌కు చెందిన టాప్‌సీడ్ క్రీడాకారిణి జోయెల్లీ కింగ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీ ఫైనల్‌లో జోయెల్లీ 11-8, 10-12, 11-6, 11-6 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన డొన్నా అర్క్‌హార్ట్‌పై విజయం సాధించి జ్యోత్స్నతో టైటిల్ పోరుకు సిద్ధమైంది.