క్రీడాభూమి

రెండేళ్ల తర్వాత సెంచరీ చేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్, ఆగస్టు 30: టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానె భావోద్వేగానికి గురయ్యాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో (81, 102) పరుగులు చేసి జట్టు గెలుపు లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. తన 10వ సెంచరీ నిజంగా తనకు ప్రతే యకమైనదిగా చెప్పాడు. తనెప్పుడూ జట్టు విజయం కోసమే చూస్తానని, ఎన్ని పరుగులు చేశానన్నది చూడనని పేర్కొన్నాడు. తను 10వ సెంచరీ చేయడానికి రెండేళ్లు పట్టిందన్నాడు. మొదటి టెస్టులో తొలి రోజు విండీస్ బౌలర్లు అద్భుతంగా రాణించారని, దీంతో తొలి ఇన్నింగ్‌లో తక్కువ స్కోరుకే జట్టు ఆలౌటైందన్నాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్‌లో తనతో పాటు కెప్టెన్ కోహ్లీ, హనుమ విహారి రాణించడంతో జట్టు 381 పరుగుల భారీ స్కోరుతో విజయం సాధిం చిన విషయం సాధించిందని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌కు ముందు సాధనే తన రాణింపు కారణమని పేర్కొన్నాడు.