క్రీడాభూమి

ఒలింపిక్స్‌లో పతకం సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: ప్రపం చ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగు షట్లర్, అర్జున అవార్డు గ్రిహీత సాయి ప్రణీత్ 2020 ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని తెలంగాణ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పత కం సాధించిన సాయి ప్రణీత్‌ను తెలంగాణ రాజ్‌భవన్‌లో శుక్రవారం గవర్నర్ దంపతులు సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ బాడ్మింటన్ కోచ్ పుల్లేల గోపిచంద్ నేతృత్వంలో అనేక మంది క్రీ డాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారన్నారు. ఒలింపిక్స్‌లో సాయిప్రణీత్ పతకంతో వచ్చే ఏడాది రాజ్‌భవన్‌కు రావాలని ఆకాంక్షించా రు. కోచ్ పుల్లెల గోపిచంద్, సింధు తల్లిదండ్రులను గవర్నర్ అభినందించారు. ఒలింపిక్స్‌లో బంగారు పత కం సాధించేందుకు శక్తివంచన లే కుండా కృషి చేస్తానని, భవిష్యత్తులో బంగారు పతకం సాధించేందుకు శక్తివంచన లేకుండా కష్టపడుతానని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకునేందుకు తగిన కృషి చేస్తానని సాయిప్రణీత్ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో అధికారులు ఏపీవీఎన్. శర్మ, ఏకే. మహంతీ, సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.