క్రీడాభూమి

యూరోప్‌లో భారత్, పాక్ హాకీ మ్యాచ్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఆగస్టు 31: ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు పరస్పరం తలపడాల్సి వస్తే, ఆ మ్యాచ్‌లను యూరోప్‌లో నిర్వహించేందుకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఐహెచ్‌ఎఫ్) కసరత్తు చేస్తున్నది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ జట్లు క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో చెరొక గ్రూప్‌లో ఉన్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించేందుకు ఈజిప్టు, దక్షిణ కొరియా, స్పెయిన్, జర్మనీ, న్యూజిలాండ్ తదితర జట్లు కూడా పోటీపడుతున్నాయి. మొత్తం ఏడు జట్లకు ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం దక్కుతుంది. ఇలావుంటే, ప్రస్తుతం తమతమ గ్రూప్స్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు మెరుగైన స్థితిలో ఉన్నాయి. దీనితో ఈ రెండు జట్ల మధ్య గ్రూప్ మ్యాచ్ తప్పకపోవచ్చు. ఒకవేళ మ్యాచ్‌లు ఆడాల్సి వస్తే, అటు భారత్‌లోగానీ, ఇటు పాకిస్తాన్‌లోగానీ అందుకు అనువైన పరిస్థితులు లేవని హెచ్‌ఐఎఫ్ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అందుకే, రెండు యూరోప్‌లో మ్యాచ్‌లను నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తున్నది. కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్‌ను భారత్ రద్దు చేయడంతో, ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అక్టోబర్ మాసంలో యుద్ధం తప్పదని పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ఇటీవల చేసిన ప్రకటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌తో అణుయుద్ధం జరగవచ్చని హెచ్చరికలు జారీ చేశాడు. ఈ నేపథ్యంలో, రెండు దేశాల్లోనూ మ్యాచ్‌లకు అనుకూల పరిస్థితులు లేవని ఎఫ్‌ఐహెచ్ భావిస్తున్నది. ఇలావుంటే, ఈ ఏడాది ప్రారంభంలో జరిగి న ప్రో హాకీ టోర్నమెంట్‌కు జట్టును పంపని కారణంగా, పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎఫ్)పై హెచ్‌ఐఎఫ్ జరిమానా విధించింది. అం దులో మొదటి విడతను పీహెచ్‌ఎఫ్ చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే ఒలింపిక్స్ క్వాలిఫైయంగ్ ఈవెంట్‌లో పాక్ జట్టుకు చోటు ఉండదు. ఈ మొత్తాన్ని విడతల వారీగా చెల్లించనున్నట్టు పీహెచ్‌ఎఫ్ ఇది వరకే ప్రకటించింది.