క్రీడాభూమి

పాక్ జట్టుకు కొత్త ఊపిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఆగస్టు 31: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సమాయత్తమైంది. వచ్చే వారం సమావేశమయ్యే బోర్డు పాలక మండలిలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఇటీవల కాలంలో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఆకట్టుకునే రీతిలో లేకపోవడంతో, కొన్ని మార్పులు చేర్పులు అత్యవసరమని పీసీబీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. పీసీబీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం, జట్టుకు చీఫ్ కోచ్‌గా మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్‌గా వకార్ యూనిస్‌ను తీసుకునే అవకాశాలున్నాయి. అదే విధంగా జాతీయ సెలక్షన్ కమిటీ చీఫ్‌గా మోసిన్ ఖాన్‌ను నియమిస్తారని అంటున్నారు. జట్టు మేనేజ్‌మెంట్‌లో ఎవరెవరు ఉండాలనే విషయంపై ఐదు సభ్యులతో కూడిన పీసీబీ కమిటీ ఇప్పటికే తన నివేదికను అందచేసింది. ఈ నివేదిక ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే, జట్టుకు హెచ్ కోచ్ పదవి మిస్బాకు దక్కుతుంది. బౌలింగ్ కోచ్‌గా వకార్ ఎంపికవుతాడు. మాజీ కెప్టెన్ ఇంతికాబ్ ఆలమ్ నేతృత్వంలో అధ్యయనం ముగించిన ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ కమిటీ ఇప్పటికీ మిస్బా, వకార్‌తోపాటు డీన్ జోన్స్, జొహాన్ బోథా, కర్ట్‌నీ వాల్ష్, యాసిర్ అరాఫత్ తదితరులను ఇంటర్వ్యూ చేసింది. మోసిన్ ప్రస్తుతం చీఫ్ సెలక్టర్‌గా, తాత్కాలిక కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. కొత్త కోచ్‌ని నియమించి, సెలక్షన్ కమిటీ చీఫ్‌గా మోసిన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. కాగా, మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్‌ను సెలక్షన్ కమిటీ చీఫ్‌గా పీసీబీ తొలుత ఎంపిక చేసింది. అయితే, ఆ ప్రతిపాదనను రషీద్ తిరస్కరించాడనీ, దీనితో మోసిన్‌ను కొనసాగించడం అనివార్యమైందని పీసీబీ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ చెప్పాయి. నిజానికి సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగేందుకు మోసిన్ దరఖాస్తు చేసుకోలేదని, రషీద్ తిరస్కరించడంలో పీసీబీకి మరో మార్గం లేకపోయిందని ఈ వర్గాలు పేర్కొన్నాయి.

చిత్రాలు..మిస్బా ఉల్ హక్
*వకార్ యూనిస్