క్రీడాభూమి

నేను గాఫ్ అభిమానిని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 31: తాను యువ క్రీడాకారిణి కొకో గాఫ్ అభిమానినని, అందుకే ఆమె మ్యాచ్‌లను ప్రేక్షకులతో కలిసి చూస్తూ ఆనందిస్తానని అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తెలిపింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో కరోలినా ముచొవాను 6-3, 6-2 తేడాతో ఓడించి, ప్రీ క్వార్టర్ ఫైనల్స్ చేరిన సెరెనా మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ, ప్రపంచ నంబర్ వన్ నవోమీ ఒసాకాతో గాఫ్ జరపబోయే పోరాటాన్ని తాను తిలకిస్తానని తెలిపింది. ఆ మ్యాచ్ ఫలితం ఎలావున్నప్పటికీ, తనకు అమెరికా మహిళల టెన్నిస్‌లో గాఫ్ ఆశాకిరణంగా కనిపిస్తున్నదని సెరెనా చెప్పింది. 15 సంవత్సరాల ఈ యువ క్రీడాకారిణి వింబుల్డన్ ద్వారా మొదటిసారి గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ ఆడుతూ సంచలన విజయాలను నమోదు చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేసింది. వింబుల్డన్ మొదటి రౌండ్‌లోనే మాజీ ప్రపంచ నంబర్ వన్ వీనస్ విలియమ్స్‌ను గాఫ్ 6-4, 6-4 తేడాతో ఓడించి అందరి దృష్టినీ ఆకర్షించింది. రెండో రౌండ్‌లో మగ్దలీన రిబరికొవాపై 6-3, 6-3 తేడాతో గెలుపొంది, తొలి రౌండ్‌లో వీనస్‌పై తన విజయం కాకతాళీయం కాదని నిరూపించింది. మూడో రౌండ్‌లో పొలొనా హెర్కోగ్‌పై 3-6, 7-6, 7-5 ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేసి ప్రీ క్వార్టర్స్ చేరింది. అయితే, అక్కడ ఆమెకు పరాజయం సిమోనా హాలెప్ రూపంలో ఎదురైంది. హాలెప్ 6-3, 6-3 స్కోరుతో గెలవడంతో, గాఫ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. యూఎస్ ఓపెన్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన ఈ అమెరికా యువ సంచలనం మొదటి రౌండ్‌లో అనస్తాసియా సెర్గెయెవ్నా పొటాపొవాను 3-6, 6-2, 6-4 తేడాతో ఓడించింది. రెండో రౌండ్‌లో టిమియా బబోస్‌పై 6-2, 4-6, 6-4 ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేసింది. మూడో రౌండ్‌లో ప్రపంచ నంబర్ వన్ ఒసాకాను ఢీకొనడం ఆమె శక్తికి మించిన పనిగానే విశే్లషకులు అభివర్ణిస్తున్నారు. అయితే, సెరెనా మాత్రం గాఫ్‌పై పూర్తి నమ్మకంతో ఉంది. ఆ మ్యాచ్ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, అయితే, అందులో వెలువడే ఫలితంతో సంబంధం లేకుండా తాను గాఫ్‌ను అభినందిస్తానని తెలిపింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న గాఫ్ యూఎస్ టెన్నిస్ రంగానికి పేరుప్రఖ్యాతులను ఆర్జించి పెడుతుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పింది. ఇలావుంటే, నాలుగో రౌండ్ ఆమె పెట్రా మాట్రిక్‌తో తలపడుతుంది. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో మాట్రిక్ 6-4, 6-3 ఆధిక్యంతో అనస్తాజియా సెవస్తోవాపై గెలుపొందింది.

చిత్రం...యూఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ చేరిన సెరెనా విలియమ్స్