క్రీడాభూమి

స్టీవ్ స్మిత్ 1, విరాట్ కోహ్లీ 2..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ, సెప్టెంబర్ 3: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో మళ్లీ మొదటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. దీంతో టీమిండియా రన్ మిషన్, కెప్టెన్ కోహ్లీ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్యాట్స్‌మెన్ల జాబితాలో కోహ్లీ తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో గోల్డెన్ డక్‌గా వెనుదిరగడంతో స్మిత్‌కు కలిసొచ్చింది. ఇప్పటికే యాషెస్ సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించిన స్మిత్, మూడో టెస్టు ఆడలేదు. నాలుగో టెస్టుకు తిరిగి జట్టులోకి రావడంతో స్మిత్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకునే అవకాశాలున్నాయ. 2018లో మొదటిసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న స్మిత్ ఆ తర్వాత బాల్ టాంరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురికావడంతో కోహ్లీ మొదటిస్థానంలో నిలిచాడు. వీరిద్దరి తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, చతేశ్వర్ పూజరా, హెన్రీ నికోల్ప్, జో రూట్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. చాలా రోజుల తర్వాత అజింక్యా రహానె టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. విండీస్‌తో సిరీస్‌లో భాగంగా సెంచరీ, అర్ధ సెంచరీ చేయడంతో నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ 908 పాయంట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టార్ కగిసో రబద రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. విండీస్ పర్యటనలో అద్భుతంగా రాణించిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఏడు స్థానాలను మెరుగుపర్చుకొని మూడో స్థానంలో చోటు దక్కించుకున్నాడు.