క్రీడాభూమి

టెస్ట్ సిరీస్ మనదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్, సెప్టెంబర్ 3: కరేబి యన్లను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించిన భారత జట్టు రెండో టెస్టులోనూ విజయం సాధించి రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్‌నుక్లీన్ స్వీప్ చేసింది. దీం తో కోహ్లీ సేన తొలిసారిగా వెస్టిండీస్ గడ్డపై సిరీస్ గెలుచు కుంది. మొదటి టెస్టులో 318 భా రీ పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు, రెండో టెస్టులోనూ ఆతిథ్య జట్టును మట్టికరిపించిం ది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిం డియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగడంతో విండీస్ 117 పరు గులకే కుప్పకూలింది. దీంతో రెం డో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 4 వికెట్లు కోల్పోయ 168 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. దీంతో 468 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ జట్టు 210 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 257 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. విండీ స్ బ్యాట్స్‌మెన్లలో షామ్రా బ్రూక్స్ (50) మాత్రమే అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాలు చెరో మూడు వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ 2, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ తీశాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీ, అర్ధ సెంచరీతో రా ణించిన హనుమ విహారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభిం చింది.
ఆరంభం అదిరింది..
టెస్ట్ చాంపినయన్‌షిప్‌లో భాగంగా టీమిండియా మొదటి సిరీస్‌లోనే అదరగొట్టింది. వెస్టిం డీస్‌తో జరిగిన ఈ సిరీస్‌లో 2-0 తేడాతో విజయం సాధించి, 120 పాయింట్లతో పట్టికలో అగ్రస్థా నంలో నిలిచింది. టీమిండియా తర్వాత న్యూజిలాండ్, శ్రీలంక జట్టు 60 పాయంట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉండగా, ఆస్ట్రేలి యా (32), ఇంగ్లాండ్ (32), వెస్టిం డీస్ (0) పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
చిత్రం... టెస్ట్ సిరీస్‌తో భారత జట్టు