క్రీడాభూమి

సెమీస్‌కు సెరెనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 4: ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఇక్కడ జరుగుతున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో ఆమె వాంగ్ కియాగ్‌ను 6-1, 6-0 తేడాతో చిత్తుచేసింది. డిఫెండింగ్ చాంపియన్ నవోమీ ఒకాసా ఇప్పటికే పరాజయాన్ని ఎదుర్కోవడంతో, ఈసారి యూఎస్ ఓపెన్‌ను దక్కించుకునేందుకు సెరెనాకు అవకాశాలు మెరుగుపడ్డాయి. కాగా, ఐదో సీడ్ ఇలినా స్విటోలినా 6-4, 6-4 ఆధిక్యంతో జొహన్నా కొన్టాపై విజయం సాధించింది.
ఫెదరర్ ఔట్
యూఎస్ ఓపెన్‌లో మాజీ ప్రపంచ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అతను అన్‌సీడెడ్ ఆటగాడు గ్రిగెర్ దిమిత్రోవ్ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో దిమిత్రోవ్ 3-6, 6-4, 3-6, 6-4, 6-2 తేడాతో గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ డానిల్ మెద్వెదెవ్ సెమీస్‌లో చోటు సంపాదించాడు. క్వార్టర్ ఫైనల్లో అతను స్టానిస్లాస్ వావ్రిన్కాను 7-6, 6-3, 3-6, 6-1 తేడాతో ఓడించాడు.

చిత్రం... సెరెనా విలియమ్స్