క్రీడాభూమి

సెలక్టర్లకు బంగర్ బెదిరింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: టీమిండియా ఇటీవల జట్టు ప్రధాన కోచ్ సహా, మిగతా సహాయ కోచ్‌లకు ఇంటర్వ్యూలను నిర్వహించిన విషయం తెలిసిందే. అయతే తనను తిరిగి రెండో సారి బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేయాలంటూ మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సెలక్షన్ కమిటీ సభ్యులపై బెదిరిం పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఏకంగా ఇంటర్వ్యూలు జరుగుతున్న సమయంలో భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో సభ్యుడైన దేవాంగ్ గాంధీ గదికి బంగర్ వెళ్లడమే కాకుండా తనను మళ్లీ బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. లేదంటే తన మదద్దతు దారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారంటూ దురుసుగా ప్రవర్తించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయ. అయతే ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో బ్యాటింగ్ కోచ్‌గా బంగర్‌ను తప్పించి విక్రమ్ రాథోడ్‌ను సెలక్షన్ కమిటీ బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది. రెండు వారాల క్రితం జరిగిన ఈ విషయం ఆలస్యంగా బయటికొచ్చింది. ఇక ఇదే విషయం క్రికెట్ పాలకుల కమిటీ అధినేత వినోద్‌రాయ్ దృష్టికి చేరింది. అసలేం జరిగింతో తెలుసుకునేందుకు బీసీసీఐ సైతం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

చిత్రం... మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్