క్రీడాభూమి

వార్నర్ మళ్లీ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, సెప్టెంబర్ 4: యాషెస్ సిరీస్‌లో భాగంగా బుధవారం నుంచి ప్రారంభమైన నాలుగో టెస్టుకు వరుణుడు అడ్డుకున్నాడు. అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. అయతే మొదటి ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ డేవిడ్ వార్నర్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ మార్కస్ హారిస్ (13) కూడా బ్రాడ్ బౌలింగ్‌లోనే ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరగడంతో ఆసిస్ 28 పరుగులకే ఓపెనర్లిద్దరినీ కొల్పోయంది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మముస్ లబుస్‌చెంజ్ (55, నాటౌట్) స్టీవ్ స్మిత్ (46, నాటౌట్)తో కలిసి జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే లబుస్‌చెంజ్ అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా 98 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. అయతే రెండో సెషన్‌లో వరుణుడు ఆటకు అడ్డుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆట ప్రారంభం కాగా, అప్పటికీ ఆస్ట్రేలియా 36 ఓవర్లలో 2 వికెట్లను కోల్పోయ 131 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ మాత్రమే 2 వికెట్లను తీసుకున్నాడు.
చిత్రాలు..స్టువర్ట్ బ్రాడ్
* డకౌట్ కావడంతో నిరాశగా పెవిలియన్‌కు చేరుతున్న డేవిడ్ వార్నర్