క్రీడాభూమి

వార్నర్ వీరోచిత పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్‌కు చేరువైంది. శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్‌లో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్ అర్ధ శతకంతో రాణించాడు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కెప్టెన్ వార్నర్ అత్యంత బాధ్యతాయుతమైన ప్రదర్శనతో అలరించాడు. సహచర బ్యాట్స్‌మన్లంతా ఘోరంగా విఫలమైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో విజృంభించిన వార్నర్ 58 బంతుల్లో 93 పరుగులు సాధించడంతో పాటు బిపుల్ శర్మ (11 బంతుల్లో 27 పరుగులు)తో కలసి పని పూర్తి చేశాడు. దీంతో 6 వికెట్ల నష్టానికి 19.2 ఓవర్లలో 163 పరుగులు సాధించిన సన్‌రైజర్స్ జట్టు 4 వికెట్ల తేడాతో ‘లయన్స్’ను మట్టికరిపించింది.
అంతకుముందు టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్ లయన్స్ జట్టు ఆరంభంలో తడబడింది. ఓపెనర్ ఏకలవ్య ద్వివేది (5)తో పాటు కెప్టెన్ సురేష్ రైనా (1) స్వల్పస్కోర్లకే పెవిలియన్‌కు పరిగెత్తడంతో ఆ జట్టు 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్‌కలమ్ (29 బంతుల్లో 32 పరుగులు), వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ (19 బంతుల్లో 26 పరుగులు) కొద్దిసేపు స్థిమితంగా ఆడి మూడో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. వీరి నిష్క్రమణ తర్వాత డ్వెయిన్ స్మిత్ ఒక్క పరుగుకే వైదొలిగినప్పటికీ ఆరోన్ ఫించ్ క్రీజ్‌లో నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించిన అతను చూడముచ్చటైన షాట్లతో అలరిస్తూ 32 బంతుల్లో 50 పరుగులు సాధించి బెన్ కటింగ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత డ్వెయిన్ బ్రావో 10 బంతుల్లో 20 పరుగులు సాధించి వెనుదిరగ్గా రవీంద్ర జడేజా (15 బంతుల్లో 19 పరుగులు), ధవళ్ కులకర్ణి (2 బంతుల్లో 3 పరుగులు) అజేయంగా నిలిచారు. దీంతో గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లంతా ఘోరంగా విఫలమయ్యారు. ‘లయన్స్’ బౌలర్ల జోరును ప్రతిఘటించలేక నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (0) పరుగుల ఖాతా ఆరంభించకుండానే పెవిలియన్‌కు చేరగా, మోజెస్ హెన్రిక్స్ (11), యువరాజ్ సింగ్ (8), దీపక్ హుడా (4), బెన్ కటింగ్ (8), వికెట్ కీపర్ నమన్ ఓజా (10) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. అయితే క్రీజ్‌లో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించిన వార్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. 35 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్న అతను మొత్తం మీద 58 బంతుల్లో 93 పరుగులు సాధించడంతో పాటు బిపుల్ శర్మ (11 బంతుల్లో 27 పరుగులు)తో కలసి అజేయంగా మిగిలిన పని పూర్తి చేశాడు. దీంతో 19.2 ఓవర్లలో 163 పరుగులు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
సంక్షిప్తంగా స్కోర్లు
గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 162/7 (ఆరోన్ ఫించ్ 50, బ్రెండన్ మెక్‌కలమ్ 32, దినేష్ కార్తీక్ 26, డ్వెయిన్ బ్రావో 20, రవీంద్ర జడేజా 19-నాటౌట్, బెన్ కటింగ్ 2/20, భువనేశ్వర్ కుమార్ 2/27)
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: 19.2 ఓవర్లలో 163/6 (డేవిడ్ వార్నర్ 93-నాటౌట్, బిపుల్ శర్మ 27-నాటౌట్, మోజెస్ హెన్రిక్స్ 11, నమన్ ఓజా 10, డ్వెయిన్ బ్రావో 2/32, షివిల్ కౌశిక్ 2/22)

chitram...
సన్‌రైజర్స్‌ను గెలిపించిన వార్నర్