క్రీడాభూమి

భారత మహిళా క్రికెట్ జట్టులో టీనేజర్ షఫాలీకి చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరగబోయే టీ-20 సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల జట్టులో టీనేజర్ సఫాలీ వర్మకు చోటు లభించింది. గార్గీ బెనర్జీ తర్వాత జాతీయ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కురాలిగా ఆమె గుర్తింపు సంపాదించింది. గార్గీ 14 సంవత్సరాల 165 రోజుల వయసులో భారత జట్టులోకి అడుగుపెట్టింది. 1978లో మొదటి వనే్డను ఇంగ్లాండ్‌పై, 1984లో మొదటి టెస్టు మ్యాచ్‌ని ఆస్ట్రేలియాపై ఆడింది. ఇలావుంటే, ఇటీవలే టీ-20 ఫార్మాట్‌కు మిథాలీ రాజ్ గుడ్‌బై చెప్పగా, షఫాలీకి జట్టులో అవకాశం లభించడం గమనార్హం. ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌లకు సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, స్మృతి మందానా వైస్ కెప్టెన్‌గా ఉంటుంది. కాగా, మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఆడే భారత జట్టుకు మిథాలీ రాజ్ కెప్టెన్‌గా సేవలు అందిస్తుంది. ఆమెకు డిప్యూటీగా హర్మన్‌ప్రీత్ కౌర్ బాధ్యతలు నిర్వరిస్తుంది.

చిత్రం... సఫాలీ వర్మ