క్రీడాభూమి

రహ్మత్ సూపర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చటోగ్రామ్, సెప్టెంబర్ 5: బంగ్లాదేశ్‌తో గురువారం ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్తాన్‌ను ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ రహ్మత్ షా అద్భుతమైన సెంచరీతో ఆదుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్ది సేపటికే, 19 పరుగుల స్కోరువద్ద ఇసానుల్లా జనత్ వికెట్‌ను అఫ్గాన్ కోల్పోయింది. 36 బంతుల్లో 9 పరుగులు చేసిన అతనిని తైజుల్ ఇస్లామ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 48 పరుగుల వద్ద మరో ఓపెన్ ఇబ్రహీం జద్రాన్ కూడా పెవిలియన్ చేరాడు. అతను 69 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్ల సాయంతో 21 పరుగులు చేసి, తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లోనే మహమ్మదుల్లా క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రహ్మత్ క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడుతుండగా, హమీబుల్లా షషీదీ 14 పరుగులు చేసి, మహమ్మదుల్లా బౌలింగ్‌లో సౌమ్య సర్కార్‌కు చిక్కాడు. 77 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన జట్టును అస్గర్ అఫ్గాన్‌తో కలిసి ఆదుకున్న రహ్మత్ నాలుగో వికెట్‌కు 120 పరుగుల అత్యంత కీలకమైన భాగస్వామ్యాన్ని అందించాడు. 187 బంతులు ఎదుర్కొన్న అతను 10 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి, నరుూమ్ హసన్ బౌలింగ్‌లో, సౌమ్య సర్కార్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. అదే ఓవర్‌లో మహమ్మద్ నబీ (0)ని నరుూమ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్‌కీపర్ అఫ్సర్ జజాయ్ (35 నాటౌట్), అస్గర్ అఫ్గాన్ (88 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గాన్ స్కోరును 96 ఓవర్లలో 5 వికెట్ల నష్టంతో 271 పరుగులకు చేర్చారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్, నరుూమ్ హసన్ చెరి రెండు వికెట్లు కూల్చారు. మహమ్మదుల్లాకు ఒక వికెట్ లభించింది.
చిత్రం... అఫ్గానిస్తాన్ సెంచరీ వీరుడు రహ్మత్ షా