క్రీడాభూమి

టైటిల్ దిశగా నాదల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 5: ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్ టైటిల్ అందుకునే దిశగా దూసుకెళుతున్నాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అతను 20వ సీడ్ డియో చార్ట్‌జ్మన్‌ను 6-4, 7-5, 6-2 తేడాతో ఓడించి సెమీ ఫైనల్ చేరుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్, స్విట్జర్లాండ్ సీనియర్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో నాదల్ విజయావకాశాలు మెరుగుపడ్డాయి. సెమీ ఫైనల్లో అతను మాటెయో బెరెటినీతో తలపడతాడు. 24వ సీడ్ ఆటగాడైన బెరెటినీ తన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 13వ సీడ్ గేల్ మోన్ఫిల్స్‌పై 3-6, 6-3, 6-2, 3-6, 7-6 తేడాతో విజయం సాధించాడు. నాదల్‌కు సెమీస్‌లో అతను ఎంత వరకూ గట్టిపోటీనిస్తాడన్నది అనుమానమే. ఫిట్నెస్ సమస్యలు లేకపోతే, నాదల్‌ను సర్వీసుల్లోగానీ, వాలీల్లోగానీ, ప్లేసింగ్స్‌లోగానీ కట్టడిచేయగలగడం అనుకున్నంత సులభం కాదు. స్వయంకృతంతో సమస్యలు తెచ్చుకుంటే తప్ప నాదల్ ఫైనల్ చేరడాన్ని బెరెటినీ ఆపడలేదన్నది విశే్లషకుల అభిప్రాయం. ఇలావుంటే, మరో సెమీ ఫైనల్లో డానియల్ మెద్వెదెవ్, గ్రిగర్ దిమిత్రోవ్ ఢీ కొంటాడు. ఇద్దరూ తమతమ క్వార్టర్ ఫైనల్స్‌లో సంచలన విజయాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. జొకోవిచ్‌ను ఇంటిదారి పట్టించిన స్టానిస్లాస్ వావ్రిన్కాను మెద్వెదెవ్ 7-6, 6-3, 3-6, 6-1 తేడాతో ఓడించి సెమీస్ చేరాడు. మరో మ్యాచ్‌లో దిమిత్రోవ్ ఈ టోర్నమెంట్‌లో హాట్ ఫేవరిట్స్‌లో ఒకడిగా బరిలోకి దిగిన ప్రపంచ మూడో ర్యాంక్ ఆటగాడు ఫెదరర్‌పై 3-6, 6-4, 3-6, 6-4, 6-2 తేడాతో గెలుపొందాడు. అసాధారణ ప్రతిభాపాటవాలను కనబరుస్తూ ముందు దూసుకెళుతున్న వీరిద్దరి మధ్య జరిగే మ్యాచ్‌లో విజయం ఎవరిని వరించినా, పోరు మాత్రం హోరాహోరీగా కొనసాగి, ప్రేక్షకులను అలరించడం ఖాయం.
స్విటోలినా ముందంజ
మహిళల సింగిల్స్‌లో ఎలినా స్విటోలినా ముందుకు దూసుకెళుతున్నది. క్వార్టర్ ఫైనల్లో ఆమె జొహన్నా కొన్టాను 6-4, 6-4 తేడాతో, వరుస సెట్లలో చిత్తుచేసింది. సెమీస్‌లో ఆమె మాజీ చాంపియన్, ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌తో తలపడుతుంది. సెరెనా క్వార్టర్ ఫైనల్లో 6-1, 6-0 తేడాతో వాంగ్ కియాంగ్‌పై సునాయాసంగా గెలిచిన విషయం తెలిసిందే. మంచి ఫామ్‌లో ఉన్న సెరెనాను స్విటోలినా ఎంత వరకూ కట్టడి చేస్తుందో చూడాలి. కాగా, మరో సెమీ ఫైనల్ బెలిండా బెన్సిక్, బియాన్కా ఆండ్రెస్క్యూ మధ్య జరుగుతుంది. బెన్సిక్ 7-6, 6-3 స్కోరుతో డొన్నా వెకిక్‌పై గెలుపొందగా, ఆండ్రెస్క్యూ 3-6, 6-2, 6-3 ఆధిక్యంతో ఎలిస్ మెర్టెన్స్‌ను ఓడించి సెమీస్ చేరింది.

చిత్రం... రాఫెల్ నాదల్