క్రీడాభూమి

భారత్ ‘ఏ’కు తొలి ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల అనధికార వనే్డ సిరీ స్‌లో భారత్ ‘ఏ’ తొలి పరాజయాన్ని ఎదుర్కొంది. వర్షం కారణంగా రిజర్వ్ డే అయన గురు వారం ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో భారత్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయస్ విధానంలో నిర్ధారించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ‘ఏ’ 25 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయ 137 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్ 60 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మాథ్యూ బ్రీజ్కె 24 పరుగులు చేశాడు. ఈ దశలో వర్షం కురిసిన కారణంగా ఆట నిలిచిపో యంది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ ‘ఏ’కు అధికారులు 198 పరుగుల లక్ష్యాన్ని నిర్ధారించారు. దీనిని అందుకోవడానికి చివరి వరకూ శ్రమించినప్పటికీ భారత్ ‘ఏ’ 25 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 188 పరుగులు చేసి, నాలుగు పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసిం ది. శిఖర్ ధావన్ 43 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు. శివం డూబే 31, శ్రేయాస్ అయ్య ర్ 26, ప్రశాంత్ చోప్రా 26 చొప్పున పరుగులు చేశారు. నిజానికి దక్షిణాఫ్రికా ‘ఏ’ కంటే భారత్ ‘ఏ’ మెరుగ్గా ఆడినప్పటికీ, డక్‌వర్త్ లూయస్ విధానం దెబ్బతీసింది. కాగా, దక్షిణాఫ్రికా ‘ఏ’ పే సర్లు అన్‌రిచ్ నోజే, మార్కో జాసన్, లుతో సిపామ్లా తలా మూడు వికెట్లు పడగొట్టి భారత్ ‘ఏ’ను దెబ్బతీశారు. ఒకానొక దశలో 3 వికెట్లకు 161 పరుగులు చేసిన భారత్ ‘ఏ’, కేవలం 17 పరుగుల తేడాలో ఏకంగా ఆరు వికెట్లను కోల్పోయంది. అయతే, నాలుగు పరుగుల తేడాతో ఓడినప్పటికీ భారత్ ‘ఏ’ సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ను కోల్పోయన దక్షి ణాఫ్రికా ‘ఏ’ ఒక విజయాన్ని దక్కించుకొని పరువు నిలబెట్టుకుంది. చివరి మ్యాచ్‌ని కూడా తన ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. కానీ, అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న భార త్ ‘ఏ’ను చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ‘ఏ’ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి.