క్రీడాభూమి

స్మిత్ డబుల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్ (ఓల్డ్ ట్రాఫోర్డ్), సెప్టెంబర్ 5: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సిరీస్‌లో మూడో సెంచరీ సాధించి, సత్తా నిరూపించుకోవడమేగాక, దానిని డబుల్ సెంచరీగా మార్చుకు న్నాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్లకు 170 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆట ఆలస్యంగా మొదలుకావడంతో, 44 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. డేవిడ్ వార్నర్ (0), మార్కస్ హారిస్ (13), మార్నస్ లబుషేన్ (67) ఔట్‌కాగా, స్మిత్ 60, ట్రావిస్ హెడ్ 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఓవర్‌నైట్ స్కో రుతో రెండో రోజు ఆట మొదలుకాగా, కొద్ది సేపటికే ట్రా విస్ హెడ్ వెనుదిరిగాడు. అతను 19 పరుగులు చేసి, స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఎల్‌బీగా ఔటయ్యాడు. మాథ్యూ వేడ్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద జాక్ లీచ్ బౌలింగ్‌లో, జో రూట్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. వికెట్లు కూలుతున్నప్పటికీ, క్రీజ్‌లో నిలదొక్కుకున్న స్మిత్ కెరీర్‌లో 26వ టెస్టు సెంచరీ నమోదు చేశాడు. అతని బ్యాటింగ్ ప్రతిభ ఆసీస్‌ను పటిష్టమైన స్థితికి చేర్చింది. అతను 118 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జాక్ లీగ్ బౌలింగ్ కొట్టిన బంతిని బెన్ స్టోక్స్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. అయితే, అది నోబాల్ కావడంతో స్మిత్‌కు లైఫ్ లభించింది. టిమ్ పైన్ 58 పరుగులు చేసి ఔట్‌కాగా, పాట్ కమిన్స్ 4 పరుగులకే వెనుదిరిగాడు. స్మిత్ 319 బంతులు ఎదుర్కొని, 24 ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో 211 పరుగులు సాధించి, జో డెన్లీ క్యాచ్ అందుకోగా జో రూట్ ఔట్ చేశాడు. కాగా, కెరీర్‌లో స్మిత్‌కు ఇది మూడో టెస్టు డబుల్ సెంచరీ. 125 ఓ వర్లు ముగిసే సమయానికి ఆసీస్ 8 వికెట్లకు 486 పరుగు లు చేసింది. మిచెల్ స్టార్క్ 53, నాథన్ లియన్ 20 పరుగు లతో అప్పటికి క్రీజ్‌లో ఉన్నారు.
*తక్కువ ఇన్నింగ్స్‌లో 26 టెస్టు సెంచరీలను పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లాండ్‌పై గురువారం చేసిన శతకం అతనికి కేరీర్‌లో 26వది. సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ 69 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను అందుకోగా, స్మిత్ 121 ఇన్నింగ్స్ తీసుకున్నిడు. సచిన్ తెండూల్కర్ 136, సునీల్ గవాస్కర్ 144, మాథ్యూ హేడెన్ 145, గారీ సోబర్స్ 155 ఇన్నింగ్స్‌లో 26 టెస్టు సెంచరీలను పూర్తి చేశారు.
*ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో ఎక్కువ సెంచరీలు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా స్మిత్ పేరు చరిత్ర పుటల్లో చేరింది. యాషెస్‌లో సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ 19 సెంచరీలు చేస్తూ, జాక్ హబ్స్ 12 శతకాలు సాధించాడు. స్మిత్ 11 సెంచరీలతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. స్టీవ్ వా 10, వాలీ హమ్మండ్, డేవిడ్ గోవర్ చెరి 9 చొప్పున యాషెస్ సెంచరీలు నమోదు చేశారు.
*
చిత్రం... డబుల్ సెంచరీ సాధించిన స్మిత్