క్రీడాభూమి

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా అమోల్ మజుందార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: గత పర్యటనలో టెస్టుల్లో భారత్‌పై దారుణ పరాజ యం ముటగట్టుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఈసారి పైచేయ సాధించేందుకు పక్కా ప్రణాళికలను రచిస్తోంది. ఈ మేరకు బ్యాటింగ్ కోచ్‌గా భారత్‌కే చెందిన అమోల్ మజుందార్‌ను నియమించు కుంది. 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన 44ఏళ్ల మజుందార్ 48.13 సగటుతో 11,167 పరుగులను సాధించాడు. అలాగే భారత్ ఏ జట్టు తరఫున 113 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించి 3286 పరుగులు చేశాడు. ఇక 1993 నుంచి 2009 వరకు ముంబై, 2009 నుంచి 2011 వరకు అస్సాం, 2012 నుంచి 2013 వరకు ఆంధ్రప్రదేశ్ తరఫున రంజీల్లో ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. దక్షిణా ఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా నియామకంపై మజుందార్ మాట్లా డుతూ వారం రోజుల క్రితమే తనను దక్షిణాఫ్రికా జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేయాలని అడిగినట్లు చెప్పాడు. అయతే అంతర్జాతీయ స్థాయలో ఒక జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేయడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మజుందార్ పేర్కొన్నాడు.