క్రీడాభూమి

దక్షిణాఫ్రికా ఏ 164 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, సెప్టెంబర్ 9: గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ మైదానం వేదికగా దక్షిణాఫ్రికాతో సోమవారం నుంచి జరుగుతున్న మొదటి అనధికార టెస్టు మ్యాచ్‌లో భారత్ ఏ జట్టు అదరగొట్టింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ ఏ జట్టు బౌలింగ్ తీసుకొని ప్రత్యర్థి జట్టుకు చెమ టలు పట్టించింది. దక్షిణాఫ్రికా ఓపెనర్లు అయడెన్ మార్క్రం (0), పీటర్ మలన్ (0) పరుగులేమీ చేయకుండానే వెనుదిరి గారు. దీంతో జట్టు స్కోరు మొదలుకాకుండానే ప్రోటీస్ జ ట్టు 2 కీలక వికెట్లను కోల్పోయంది. మరికొద్దిసేపటికే జుబే యర్ హంజా (13), ఖాయ జొండో (6), సినారన్ ముత్తు సామి (12), హెన్రీచ్ క్లాసెన్ (0) తీవ్రంగా నిరాశ పరచగా, చివర్లో వియాన్ మల్డర్ (21), డేన్ పీడ్ట్ (33), మార్కో జానె్సన్ (45, నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత లుతో సిపామ్లా (9), లుంగి ఎంగిడి (15) త క్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో దక్షిణాఫ్రికా ఏ జట్టు మొద టి ఇన్నింగ్స్‌లో 51.5 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైం ది. భారత ఏ బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, క్రిష్ణప్ప గౌతమ్ చెరో 3 వికెట్లు తీయగా, షాబాజ్ నదీమ్ 2, మహ్మద్ సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు.
శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీ..
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఏ జట్టుకు ఓపెన ర్లు చక్కని శుభారంభాన్ని అందించారు. రుత్‌రాజ్ గైక్వాడ్ (30) పరుగుల వద్ద జానె్సన్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. దీంతో 48 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రికీ భూల్ తో కలిసి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (66, నాటౌట్) అర్ధ సెంచరీ భాగస్వామాన్ని నమోదు చేశాడు. ఈ దశలో భుల్(26)ను ఎంగిడి పెవిలియన్‌కు పంపాడు. దీంతో అంకిత్ బానె (6, నాటౌట్)తో కలిసి గిల్ స్కోరు బోర్డును ముందుకు నడిపించే బాధ్యత తీసుకున్నాడు. అప్పటికే మొదటి రోజు ముగియడంతో భారత ఏ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 38 ఓవర్లలో 2 వికెట్లను కోల్పోయ 129 పరుగులు చేసింది.