క్రీడాభూమి

మెస్సీకి గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాన్ జువాన్ (అర్జెంటీనా), మే 28: అర్జెంటీనా సాకర్ హీరో లియోనెల్ మెస్సీ గాయపడ్డాడు. వచ్చేనెల అమెరికాలో కోపా అమెరికా సెంటినరీ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ జరగనుండగా, అందులో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న మెస్సీ హోండురాస్‌తో జరిగిన ఒక వామప్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో ప్రత్యర్థి ఆటగాడిని బలంగా ఢీకొన్నాడు. కిందపడి, బాధతో అల్లాడుతున్న అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0 తేడాతో గెలిచినప్పటికీ, స్టార్ ఆటగాడు మెస్సీ గాయపడడం అర్జెంటీనా ఫుట్‌బాల్ అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నది. కోపా అమెరికాలో మెస్సీ బరిలోకి దిగుతాడా లేదా అన్న అనుమానం వారిని వేధిస్తున్నది. అయితే, అతనికి ఎంత కాలం విశ్రాంతి అవసరమన్న విషయాన్ని వైద్యులు ఇంకా ప్రకటించలేదు.