క్రీడాభూమి

పీసీఐ గుర్తింపు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అధ్యక్షుడు రావు ఇందర్ జిత్ సింగ్‌ను తొలగించే క్రమంలో జాతీయ క్రీడా నిబంధనలను పీసీఐ అమలు చేయలేదని క్రీడా మంత్రిత్వ శాఖ ఆరోపించింది. పాలనాపరమైన వైఫల్యాల కారణంగానే పీసీఐ తన ఉనికిని కోల్పోయిందని వ్యాఖ్యానించింది. ఈ ఏడాది మే మాసంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో సింగ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, తొలగించినట్టు పీసీఐ ప్రకటించింది. అయితే, నిర్ణయంపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందంచింది. ఈ నిర్ణయం ఎందుకు, ఎప్పుడు తీసుకున్నారో వివరించాల్సిందిగా పీసీఐని కోరింది. అయితే, సరైన వివరణ ఇవ్వని కారణంగా పీసీఐ గుర్తింపును రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. తుది నిర్ణయం తీసుకునే వరకూ రద్దు కొనసాగుతుందని స్పష్టం చేసింది.