క్రీడాభూమి

సిరీస్‌పై కంగారూల కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్ : యాషెస్ సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి జరిగే చివరి టెస్టును గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని ఆస్ట్రేలియా జట్టు పట్టుదలతో ఉంది. మరోవైపు ప్రపంచకప్ హీరోలు, ఇంగ్లీష్ జట్టు సొంత గడ్డపై చిరకాల ప్రత్యర్థి ని కట్టడి చేయడంలో అన్ని విభాగాల్లో విఫమవు తోంది. దీంతో చివరి మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 2-2 తేడాతో సమం చేసి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.
కంగారూల ఆశలన్నీ స్మిత్‌పైనే..
బాల్ ట్యాంపరింగ్‌తో ఏడాది పాటు నిషేధానికి గురై, తిరిగి యాషెస్ సిరీస్‌తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటిన స్టీవ్ స్మిత్ ఈ సిరీస్‌లో అద్భు తంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే స్మిత్ కారణం గానే ఆసిస్ రెండు టెస్టులు గెలిచింది. ఇప్పటికే టోర్నమెంటులో 134.20 బ్యాటింగ్ సగటుతో మూడు సెంచరీలు బాదాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ ఉండగా, త్రుటిలో మరో సెంచరీకి దూరం కావాల్సి వచ్చింది. అంతేకాకుండా 671 పరుగులతో సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా స్మిత్ ముందున్నాడు. ఇంగ్లాండ్ అభిమానులు ఎన్ని విధాలుగా స్మిత్‌ను అవమానించినా, అవేవీ పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి సారించి బ్యాట్‌తోనే అందరికీ బదులిచ్చాడు. అయతే చివరి టెస్టులోనూ ఆసిస్ స్మిత్‌పైనే ఆశలు పెట్టుకుంది.
వార్నర్ రాణించేనా..?
మొన్న జరిగిన ప్రపంచకప్‌లో 647 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ యాషెస్ సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు టెస్టులో కలిపి కేవలం 79 పరుగులు మాత్రమే చేయగా, ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. మొత్తం ఇన్నింగ్స్‌ల్లో పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరి నిరాశ పర్చాడు.
స్టోక్స్ ఒక్కడే..
ఇక ఆతిథ్య జట్టు విషయానికొస్తే ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ జో రూట్ దారుణంగా విఫలమవుతున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో కేవలం 247 పరుగులు మాత్రమే చేశాడు. మూడు ఇన్నింగ్‌ల్లో మూడు సార్లు డకౌట్ కాగా, మూడు అర్ధ సెంచరీలను మాత్రమే నమోదు చేశాడు. ఇక బౌలింగ్‌లో సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 19 వికెట్లు మినహా మరెవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. అయతే వరల్ట్ కప్ స్టార్ బెన్ స్టోక్స్ ఒక్కడే 354 పరుగులతో స్టీవ్ స్మిత్ తర్వాతి స్థానంలో నిలిచాడు. మూడో టెస్టును ఒంటి చెత్తో గెలిపించిన స్టోక్స్ నాలుగో టెస్టులో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఇక ఇంగ్లాండ్ జట్టులో మిగతా బ్యాట్స్‌మెన్లు ఆడపదడప రాణించినా జట్టును గెలిపించే ఇన్నింగ్ మాత్రం ఆ డడం లేదనే చెప్పాలి. ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికొస్తే కమ్మిన్స్ ఒక్కడే 19 వికెట్లను తీసి మంచి ఫాంలో ఉన్నాడు.
గెలిస్తే చరిత్రే..
ప్రస్తుతం చివరి టెస్టును ఆస్ట్రేలియా గెలిచినా, డ్రా చేసినా సరికొత్త చరిత్రను సృష్టించనుంది. గత 18 ఏళ్లుగా ఇంగ్లాండ్ గడ్డపై యాషెస్ సిరీస్ గెలవని కంగారూలకు ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. చివరి మ్యాచ్‌ను గెలిస్తే ఈ ఘనత కెప్టెన్ టిమ్ పైన్‌కు దక్కనుంది.
చిత్రాలు.. . జో రూట్ * డేవిడ్ వార్నర్