క్రీడాభూమి

రియోకు సీమ క్వాలిఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: భారత వెటరన్ డిస్కస్ త్రోయర్ సీమా పునియా రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం కాలిఫోర్నియాలోని సలినాస్‌లో జరుగుతున్న పాట్ యంగ్స్ త్రోయర్స్ క్లాసిక్ ఈవెంట్‌లో పాల్గొన్న 32 ఏళ్ల సీమ 62.62 మీటర్ల దూరానికి డిస్కస్‌ను విసిరి ఒలింపిక్స్ అర్హతగా నిర్దేశించిన 61 మీటర్ల దూరాన్ని సులభంగా పూర్తి చేసింది. రియోకు అర్హత సంపాదించింది. ఈ క్రమంలో భాగంగా ఆమె 2008 ఒలింపిక్ డిస్కస్ త్రో చాంపియన్ స్ట్ఫోనీ బ్రౌన్ ట్రాఫ్టన్‌ను రెండో స్థానానికి నెట్టి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 2004 ఒలింపిక్స్‌లో పాల్గొన్న సీమ 2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ పోటీపడింది. వరుసగా రెండోసారి, మొత్తం మీద మూడోసారి ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయింది.