క్రీడాభూమి

ఆటతీరు బాగుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: ప్రపంచ క్రికెట్ క్రీడారంగంలో భారత క్రికెట్ జట్టు భేషుగ్గా ఉందని, ఆటలో జట్టు ఇతర దేశాల జట్లను సాహసోపేతంగా ఢీకొంటూ చాలా బలంగా ఆడుతోందని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కితాబిచ్చాడు. గురువారం ఆయన అనంతపురంలోని ఆర్టీడీ క్రీడాగ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌లో క్రికెట్‌కు మంచి ప్రోత్సాహం లభిస్తోందన్నాడు. అభిమానులు క్రికెట్‌ను బాగా ఆరాధిస్తున్నారని అన్నాడు. ఈ నేపథ్యంలో భారత్ జట్టు మంచి ఆటతీరు కనబరుస్తోందన్నాడు. ఇండియన్ టీమ్ ప్రదర్శన మిగిలిన టీమ్‌లకు ప్రమాదకరంగా మారిందంటూ ఆస్ట్రేలియాలోనే ఆస్ట్రేలియన్ జట్టుపై ఆడిన తీరును ఉటంకించాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ ఆట తీరుపై స్పందిస్తూ ఒక్కోసారి కొన్ని మార్పులు చోటుచేసుకుంటుంటాయని, ఫీల్డింగ్‌లో కొంత తడబాటు ఉందని అభిప్రాయపడ్డాడు. అంతకుముందు ఆయన ఆర్డీటీ క్రీడా గ్రామంలోని క్రికెట్ స్టేడియాన్ని చూసి అబ్బురపడ్డాడు. ఇక్కడ క్రికెట్ గ్రౌండ్‌తో పాటు ఫుట్‌బాల్, హాకీ క్రీడా మైదానాలు, రఫా నాదల్ టెన్నిస్ ఫౌండేషన్, జూడో ఇండోర్ స్టేడియంను తిలకించి, అక్కడి క్రీడాకారులతో ముచ్చటించి గ్రూప్ ఫొటోలు దిగాడు. ఆర్డీటీ క్రీడా మైదానంలో ఆర్డీటీ సంస్థ ప్రతినిధులు, క్రీడాకారులు గిల్‌క్రిస్ట్‌కు ఘన స్వాగతం పలికారు.
*చిత్రం...అనంతపురం నగరంలోని ఆర్డీటీ గ్రౌండ్‌ను పరిశీలిస్తున్న ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్