క్రీడాభూమి

విజయమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, మే 29: క్వాలిఫయర్స్‌తో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతానని భారత స్టార్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ చెప్పింది. ఈ ఈవెంట్ కోసం జకార్తా వచ్చిన ఆమె పిటిఐతో మాట్లాడుతూ ఫిట్నెస్ సమస్యలేవీ ప్రస్తుతం బాధించడం లేదని చెప్పింది. రియో ఒలింపిక్స్ సమీపిస్తున్న నేపథ్యంలో జకార్తా ఓపెన్ వామప్ ఈవెంట్‌గా ఉపయోగపడుతుందని తెలిపింది. కాలి మడమ గాయం కారణంగా ఇటీవల చాలా టోర్నీలకు గైర్హాజరైన సైనా ఈ సీజన్‌లో ఒక్క టైటిల్ కూడా గెల్చుకోలేకపోయింది. అయితే, మహిళల టీం ఈవెంట్ ఉబేర్ కప్‌లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లను గెలిచింది. కానీ, నాకౌట్‌లో థాయిలాండ్ క్రీడాకారిణి రచానొక్ ఇంతనాన్, చైనాకు చెందిన లీ జురుయ్ చేతిలో పరాజయాలను చవిచూసింది. ఫలితంగా సెమీస్‌లో ఓటమిపాలైన భారత్‌కు కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. 2009, 2010, 2012 సంవత్సరాల్లో ఇండోనేషియా ఓపెన్‌ను గెల్చుకున్న సైనాతోపాటు మరో హైదరాబాద్ పివి సింధు కూడా టైటిల్‌ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్, అజయ్ జయరామ్ ఈ ఈవెంట్ నుంచి వైదొలగ్గా, పారుపల్లి కశ్యప్ కాలి గాయానికి చికిత్స చేయించుకుంటున్నాడు. హెచ్‌ఎస్ ప్రణయ్ కాలి బొటనవేలి గాయంతో బాధపడుతున్నారు. కీలక ఆటగాళ్లంతా వివిధ కారణాలతో టోర్నీకి దూరం కావడంతో భారత్ పోరాటాన్ని కొనసాగించే బాధ్యత సాయ్ ప్రణీత్, గురుసాయి దత్‌పై పడింది. సమీర్ వర్మ కూడా రంగంలో ఉన్నాడు. అయితే, వీరిలో టైటిల్ సాధించే సత్తా ఎవరికీ లేదన్నది వాస్తవం.