క్రీడాభూమి

అఫ్గాన్ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, సెప్టెంబర్ 15: ముక్కోణపు వనే్డ సిరీస్‌లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 25 పరుగుల తేడాతో గెలిచి, మొత్తం రెండు విజయాలతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. బంగ్లాదేశ్ ఒక మ్యాచ్‌ని గెలిచి, మరో మ్యాచ్‌లో పరాజయాన్ని ఎదుర్కోగా, ఈ సిరీస్‌లో ఆడుతున్న మూడో జట్టు జింబాబ్వే రెండు పరాజయాలను చవిచూసింది. ఆదివారం నాటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 164 పరుగులు చేసింది. అస్గర్ అఫ్గాన్ 40, మహమ్మద్ నబీ 84 చొప్పున పరుగులు చేశారు. ఈ జట్టు స్కోరులో మూడో అత్యధిక స్కోరు 18 పరుగులతో ఎక్‌స్ట్రాలు ఆక్రమించాయి. బంగ్లా బౌలర్ మహమ్మద్ సైఫుద్దీన్ 33 పరుగులకు నాలుగు వికెట్లు కూల్చాడు. షకీబ్ అల్ హసన్ 18 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు. అత్యంత సాధారణంగా కనిపించిన 165 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఛేదించకుండా అఫ్గాన్ అడ్డుకోగలిగింది. అఫ్గాన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. మహమ్మదుల్లా 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సబ్బీర్ రహ్మాన్ 24 పరుగులు సాధించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ అనుకున్న విధంగా రాణించలేకపోవడంతో బంగ్లాదేశ్‌కు ఓటమి తప్పలేదు. అఫ్గాన్ బౌలర్ ముజెబ్ ఉర్ రహ్మాన్ 35 పరుగులకు నాలుగు వికెట్లు కూల్చాడు. ఫరీద్ మాలిక్, కెప్టెన్ రషీద్ ఖఆన్, గుల్బదీన్ నరుూబ్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.