క్రీడాభూమి

దినేష్ కార్తీక్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: టీమిండి యా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్‌కు భారీ ఊరట లభించింది. తన క్షమాపణలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మన్నించి, ఇంతటితో ఈ వివాదం ముగిసినట్లు ప్రకటించింది. బీసీసీఐ సెంట్రల్ కాం ట్రాక్టు పొందుతున్న కార్తీక్ ఇటీవల కరేబియాన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) మ్యాచ్‌ను వీక్షించేందుకు బీసీసీఐ అ నుమతి లేకుండానే వెళ్లాడు. అంతే కాకుండా అక్కడ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జెర్సీని ధరించి, డ్రెస్సింగ్ రూంలో కూర్చోవడం వివాదానికి తెర తీసింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు పొందుతున్న క్రికెటర్ అనుమతి లేకుండా ఎలాంటి ప్రచారానికి వెళ్లొద్ద నే నిబంధనలున్నాయ. దీనిపై బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ నీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దంటూ దినేష్ కార్తీ క్‌కు నోటీసులు పంపించారు. దినేష్ వెంటనే తను చేసింది తప్పేనని, మళ్లీ ఇలాంటివి పునరావృతం కానివ్వబో నని బీసీసీఐకి క్షమాపణలు చెప్పాడు. దీనిపై బీసీసీఐ సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇక ఈ వివాదం ముగిసిన అధ్యా యమని పేర్కొంటూ, దినేష్ వినతిని క్షమించింది, అయతే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కు చెందినది. ఐపీఎల్ నైట్ రైడర్స్ కెప్టెన్‌గా దినే ష్ కార్తీక్ ఉన్న విషయం తెలిసిందే.