క్రీడాభూమి

స్మిత్ నెంబర్ 1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ : యాషెస్ టెస్టు ముగిసిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకులను విడుదల చేసింది. యాషెస్ సిరీస్‌లో 774 పరుగులతో రాణించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ 937 రేటింగ్ పాయంట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ 903 పాయంట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోగా, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 878, టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా 825, న్యూజిలాండ్ ఆటగాడు హెన్రీ నికోల్స్ 749 పాయంట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ 731 పాయంట్లతో ఆరో స్థానంలో ఉండగా, టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానె 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 685 రేటింగ్ పాయంట్లతో 13వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
కమిన్స్‌దే అగ్రస్థానం..
యాషెస్ సిరీస్‌లో 29 వికెట్లు తీసిన ప్యాట్ కమిన్స్ 908 రేటింగ్ పాయంట్లతో టాప్‌లో కొనసాగుతుండగా, దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబద 851 పాయంట్లతో ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా 835 పాయంట్లతో మూడో స్థానంలో నిలవగా, వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ 814, దక్షిణాఫ్రికా బౌలర్ వెర్నన్ ఫీలండర్ 813 పాయంట్లతో నాలుగు, మూడో స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఇక గాయం కారణంగా మధ్యలోనే యాషెస్ సిరీస్‌కు దూరమైన జేమ్స్ అండర్సన్ 798 పాయంట్లతో 6వ స్థానంలో నిలిచాడు. టాప్-10లో భారత్ నుంచి జస్ప్రీత్ బుమ్రాకు ఒక్కడికే చోటు దక్కింది.
*చిత్రం...స్టీవ్ స్మిత్