క్రీడాభూమి

రెండో టీ20 ఆసిస్ మహిళల వశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్బడోస్, సెప్టెంబర్ 17: వెస్టిండీస్ మహిళా జట్టుతో మంగళ వారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళా జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసిస్ 2-0 తేడాతో గెలుచుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విండీస్ మహిళా జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయ 97 పరుగులు చేసింది.
బ్రిట్ని కూపర్ (39), చినెల్లి హెన్రీ (21, నాటౌట్), షబికా గజ్నబి (11) మాత్రమే రెండంకెల స్కోరును సాధించారు. ఆ తర్వాత ఆసిస్ జట్టు 1 వికెట్ మాత్రమే కోల్పోయ 14.3 ఓవర్‌లో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఎలీసా హెలీ (58, నాటౌట్) , మెగ్ లన్నింగ్ (22, నాటౌ ట్) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఎలీసా హెలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 బుధవారం జరగనుంది. ఇప్పటికే వనే్డ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా జట్టు టీ20 ని కూడా క్లీన్ స్వీప్ చేయాలని భావి స్తోంది.