క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్.. ప్రీ క్వార్టర్స్‌కు సెరెనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 29: ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్ చేరింది. కెరీర్‌లో 22వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌పై కనే్నసిన ఆమె మూడో రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టినా మ్లాడెనోవిచ్‌ను 6-4, 7-6 తేడాతో ఓడించింది. క్వార్టర్స్‌లో స్థానం కోసం ఆమె ఉక్రెయిన్‌కు చెందిన 18వ సీడ్ ఎలినా స్విటోలినాను ఢీ కొంటుంది. మూడో రౌండ్‌లో స్విటోలినా మాజీ చాంపియన్ అనా ఇవానోవిచ్‌పై విజయభేరి మోగించింది. సెరెనా సోదరి, ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్ 7-6, 1-6, 6-0 ఆధిక్యంతో అలిజ్ కార్నెట్‌ను ఓడించి ప్రీ క్వార్టర్స్ చేరింది. 35 ఏళ్ల వీనస్ 2010 తర్వాత నాలుగో రౌండ్‌లోకి అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. మరో మ్యాచ్‌లో మాడిసన్ కీస్ 7-6, 6-3 స్కోరుతో మోనికా పెగ్‌పై విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌లో స్థానం సంపాదించింది. నాలుగో సీడ్ గార్బినె ముగురుజా 6-3, 6-4 ఆధిక్యంతో స్వెత్లానా కుజ్నెత్సొవాపై సులభంగా నెగ్గింది. ఇరినా కమేలియా బెగుపై షెల్బీ రోజర్స్ 6-3, 6-4 స్కోరుతో వరుస సెట్లలో విజయం సాధించింది.
జొకోవిచ్ ముందంజ
కెరీర్‌లో అందని ద్రాక్షగా మిగిలిపోయిన ఫ్రెంచ్ ఓపెన్‌ను కైవసం చేసుకోవడానికి 12వ సారి ప్రయత్నిస్తున్న ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్‌ను సమర్థంగా పూర్తిచేసి ముందంజ వేశాడు. బ్రిటన్ యువ ఆటగాడు అల్జాజ్ బెడెన్‌ను అతను 6-2, 6-3, 6-3 తేడాతో చిత్తుచేశాడు. కెరీర్‌లో తొమ్మిది పర్యాయాలు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకొని రికార్డు సృష్టించిన ‘క్లే కోర్టు హీరో’ రాఫెల్ నాదల్ గాయం కారణంగా వైదొలగడంతో విజేతగా నిలిచే అవకాశాలు జొకోవిచ్‌కు మరింత మెరుగుపడ్డాయి. మరో మ్యాచ్‌లో డొమినిక్ థియెమ్ 6-7, 6-3, 6-3, 6-3 ఆధిక్యంతో జర్మనీకి చెందిన టీనేజర్ అలెక్సాండర్ జ్వెరెవ్‌పై గెలిచి ప్రీ క్వార్టర్స్ చేరాడు. డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రిన్కా మూడో రౌండ్‌లో విక్టర్ ట్రోయికీని 7-6, 6-7, 6-3, 6-2 ఆధిక్యంతో ఓడించి ప్రీ క్వార్టర్స్ చేరాడు. మిలోస్ రవోనిక్‌పై అల్బర్ట రామోస్ వినోలాస్ 6-2, 6-4, 6-4 స్కోరుతో గెలుపొందాడు. డేవిడ్ ఫెరర్ 6-4, 7-6, 6-1 తేడాతో ఫెలిసియానో లొపెజ్‌ను ఓడింగా, ఏడో సీడ్ థామస్ బెర్డిచ్ 6-4, 3-6, 6-2, 7-5 స్కోరుతో పాబ్లో క్యూవాస్‌పై గెలిచాడు. డేవిడ్ గోఫిన్ చివరి వరకూ ఉత్కంఠ రేపని మ్యాచ్‌లో 6-2, 4-6, 6-3, 4-6, 6-2 స్కోరుతో నికొలాస్ ఆల్మగ్రోపై గెలిచాడు.
క్వార్టర్స్‌లో పేస్, బొపన్న
వేరువేరు భాగస్వాములతో పురుషుల డబుల్స్‌లో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు లియాండర్ పేస్, రోహన్ బొపన్న క్వార్టర్ ఫైనల్స్ చేరారు. మార్సిన్ మాట్కోవ్‌స్కీతో కలిసి ఆడుతున్న పేస్ 7-6, 7-6 స్కోరుతో బ్రూనో సోరెస్, జమీ ముర్రే జోడీపై విజయం సాధించాడు. కాగా, రుమేనియాకు చెందిన ఫ్లోరియన్ మెర్గియాతో కలిసి ఆడుతున్న బొపన్న ప్రీ క్వార్టర్స్‌లో మార్కస్ డానియల్, బ్రియాన్ బేకర్ జోడీపై 6-2, 6-7, 6-1 తేడాతో గెలుపొందాడు.