క్రీడాభూమి

ధోనీకి సమయం అసన్నమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్‌కు సమయం అసన్నమైందని టీమిండి యా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధోనీపై గౌరవంతో బీసీసీఐ అతడి రిటైర్మెంట్‌పై మాట్లా డడం లేదని, దీనిపై తనే నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 సిరీస్‌కు ధోనీ వయసు 39కి చేరుతుం దని, బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే తన రిటైర్మెంట్ గురించి వెల్లడించాలని అజ్‌తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పే ర్కొన్నారు. ధోనీకి ప్రత్యామ్నా యంగా రిషభ్ పంత్ ఉన్నాడన్నాడు. ప్రస్తుతం పంత్ కూడా సరైన ఫాంలో లేడని, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడని, అవస రమైతే సంజూ శాంసన్‌ని కూడా వచ్చే టీ20 ప్రపంచకప్ వరకు తీర్చిదిద్దాల ని సూచించాడు.