క్రీడాభూమి

సర్ఫరాజ్.. టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, సెప్టెంబర్ 20: పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆ దేశ మాజీ ఆటగాళ్లు షాహీద్ అఫ్రిది, జహీ ర్ అబ్బాస్‌లు విమర్శించారు. టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుం టే జట్టుతో పాటు తనకూ మంచిదని అభిప్రాయపడ్డారు. వనే్డ, టీ20 లకు కెప్టెన్‌గా సర్ఫరాజ్ విజయవంతమ య్యాడని, కానీ టెస్టుల్లో మాత్రం సత్తా చాటలేదని పేర్కొన్నారు. టెస్టు క్రికెట్ చాలా కఠినమైనదని, సర్ఫరాజ్ స్వత హగా టెస్టు సారథ్య బాధ్యతల నుం చి తప్పుకొని పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి సారించాలని అఫ్రిది సూచిం చగా, జహీర్ అబ్బాస్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు. అంతేకాకుండా అబ్బాస్ మాట్లాడుతూ పాక్ జట్టు కోచ్‌గా, చీఫ్ సెలక్టర్‌గా మిస్బావుల్ హాక్‌ను నియమించడం సరైంది కాదన్నాడు.
రెండు పదవులు ఒకరికే అప్ప గించడంతో అతడిపై ఒత్తిడి పడుతుం దని పేర్కొన్నాడు.