క్రీడాభూమి

శ్రీలంకతో సిరీస్‌కు పాక్ జట్టు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, సెప్టెంబర్ 21: ప్రపంచకప్‌లో పేలవమైన ఆటతీరుతో గ్రూప్‌లోనే టోర్నీ నుంచి నిష్రక్రమించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయ. మెగా టోర్నీ తర్వాత తొలి సిరీస్ ఆడుతున్న పాక్ జట్టుకు చీఫ్ సెలక్టర్, హెడ్ కోచ్‌గా మాజీ ఆటగాడు మిస్బావుల్ హక్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నియమించింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిస్బా బలమైన జట్టును ఎంపిక చేసినట్లు పేర్కొన్నాడు. ఈ సీరిస్‌లో సీనియర్ ఆటగాడు మహ్మద్ హఫీజ్‌ను పక్కనబెట్టారు. మరోవైపు ఇటీవల పేలవ ఫాంతో తంటాలు పడుతున్న మహ్మద్ అమీర్‌కు చోటు కల్పించాడు. శనివారం ఎంపిక చేసిన జట్టులో ఐదుగురు కొత్త ఆటగాళ్లను తీసుకున్నారు. ఈ సందర్బంగా మిస్బా మాట్లాడుతూ ‘మేం బలమైన జట్టును ఎంపిక చేయాలని భావించాం. అందుకే ఐదుగురుకొత్త వాళ్లను ఎంపిక చేశాం. ఇందులో నలుగురు ప్రపంచకప్‌కు ఆడాల్సిన వాళ్లే. కానీ వారికి అవకాశం దక్కలేదు. అన్ని విభాగాల్లో పాక్ బలంగా ఉంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడితే పాక్‌దే విజయం’ అని పేర్కొన్నాడు.
పాకిస్తాన్ జట్టు: సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), బాబర్ అజమ్ (వైస్ కెప్టెన్), అబిద్ అలీ, ఆసిఫ్ అలీ, ఫఖర్ జామన్, హారీస్ సోహైల్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీమ్, ఇమాముల్ హక్, అమిర్, మహ్మద్ హస్నైన్, నవాజ్, రియాజ్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ షిన్వారీ, వాహబ్ రియాజ్.