క్రీడాభూమి

గ్రేవ్స్ అర్ధ సెంచరీ; ట్రైడెంట్స్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయంట్ లూసియా, సెప్టెంబర్ 21: కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో సెయంట్ లూసియా జూక్స్ జట్టుపై బార్బడోస్ ట్రైడెంట్స్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన లూసియా జూక్స్ ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. దీంతో ట్రైడెంట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయ 172 పరుగులు చేసింది. ట్రైడెంట్స్ బ్యాట్స్‌మెన్లలో జస్టిన్ గ్రేవ్స్ (57), జొనథాన్ కర్టర్ (30), జాన్సన్ చార్లెస్ (28) రాణించారు. లూసియా జూక్స్ బౌలర్లలో కెస్రిక్ విలియమ్స్ 3 వికెట్లు తీయగా, ఒబెడ్ మెక్కాయ్ 2, రకీం కార్న్‌వాల్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన లూసియా జూక్స్ 101 పరుగులకే కుప్పకూలింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ హర్దస్ విజియన్ (31), కొలిన్ డీ గ్రాండ్ హోం (28) మాత్రమే రాణించడంతో 71 పరుగులతో పరాజయం పాలైంది. ట్రైడెంట్స్ బౌలర్లలో జోషువా బిషప్, జాసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, రేమన్ రిఫెర్, జోష్ లాలర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.