క్రీడాభూమి

నా గురువును గౌరవించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణల కారణంగా అర్జున అవార్డు ఎంపికకు నోచుకోని ఇండియన్ బాక్సింగ్ దిగ్గజం అమిత్ పంగల్ (52కేజీలు) పురస్కారాల అంశంపై పెదవి విప్పారు.
తనను అర్జున అవార్డుతో గౌరవించకపోయినా తాను పట్టించుకోనని, అయితే తన కోచ్ అనిల్ ధంకర్‌ను ద్రోణాచార్య పురస్కారంతో సత్కరించాలని ఆయన కోరారు. అమిత్ పంగల్ 2012లో డోపింగ్ పరీక్షల్లో విఫలమయ్యాడు. రష్యాలోని ఎకటెరిన్‌బర్గ్‌లో ఇటీవల ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకం సాధించిన తొలి బారతీయ బాక్సర్‌గా పంగల్ నిలిచాడు. అతను ఆసియన్ గేమ్స్, ఆసియన్ చాంపియన్‌షిప్స్‌లోనూ స్వర్ణ పతకాలు సాధించాడు. అయితే, గతంలో 2012లో డోప్ పరీక్షల్లో విఫలమయిన కారణంగా అతని పేరును అర్జున అవార్డు కోసం పరిశీలనలోకి తీసుకోలేదు. డోప్ పరీక్షలో విఫలమయినందుకు అతనిపై సంవత్సరం పాటు నిషేధం కూడా విధించారు. డోప్ పరీక్షలు నిర్వహించిన సంవత్సరంలో పంగల్ పొంగు (చికెన్ పాక్స్) వ్యాధికి చికిత్స తీసుకున్నాడు. ‘నాకు అవార్డు రానిదానిని నేను నిజంగా పట్టించుకోవడం లేదు. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా కోచ్ అనిల్ ధంకర్ సర్ పేరును ద్రోణాచార్య పురస్కారానికి పరిశీలిస్తే నేను కృతజ్ఞుడిని. ఆయనే తొలినాళ్లలోనే నన్ను బాక్సర్‌గా తీర్చిదిద్దారు. ఆయన కృషి లేకుంటే నేను ఈ రోజు బాక్సర్‌గా ఉండేవాడిని కాదు’ అని పంగల్ ఒక వార్తాసంస్థ ప్రతినిధితో అన్నాడు. ‘ధంకర్ సర్‌కు అవార్డు ఇస్తే నాకు ఇచ్చినట్టే’ అని కూడా పంగల్ పేర్కొన్నాడు.