క్రీడాభూమి

నేను ఏ తప్పూ చేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యూరిచ్, డిసెంబర్ 18: అవినీతి, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్ తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశాడు. ఫిఫా ప్రధాన కార్యాలయంలోని ఎథిక్స్ కోర్టు ముందు బ్లాటర్ హాజరుకాగా, అతనితోపాటు సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న మైఖేల్ ప్లాటినీ గైర్హాజరయ్యాడు. కాగా, బ్లాటర్‌ను న్యాయమూర్తులు పలు అంశాలపై ప్రశ్నించారు. బ్లాటర్ సుమారు ఎనిమిది గంటలు కోర్టు ఆవరణలో గడిపాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై వచ్చిన అభియోగాలు అర్థరహితమని అతను కోర్టులో పేర్కొన్నాడు. తనను ఇబ్బందికి గురి చేయాలన్న ఉద్దేశంతోనే తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించాడు. మైఖేల్ ప్లాటినీకి 2011లో రెండు మిలియన్ డాలర్లను చెల్లించిన వ్యవహారంలో బ్లిటర్‌పై అభియోగాలున్నాయి. ఎన్నికల్లో ప్లాటినీని పోటీ చేయకుండా తప్పించడానికే అతను ఫిఫా డబ్బును ఈ విధంగా దారి మళ్లించడాన్నది ప్రధాన ఆరోపణ. సుమారు దశాబ్దం క్రితం జరిగినట్టు చెప్తున్న పనుల కోసం 2011లో చెల్లింపులు జరపడం ఏమిటని ఫిఫా ఎథిక్స్ కోర్టు ప్రశ్నించింది. నిబంధనల ప్రకారమే ప్లాటినీకి చెల్లింపులు జరిగాయని బ్లాటర్ తరఫు లాయర్ లోరెంజ్ ఎర్నీ వాదించాడు. బ్లాటర్ ఎలాంటి పొరపాటు చేయలేదని అన్నాడు. బ్లాటర్‌ను ఇబ్బంది పెట్టడానికే ఆరోపణలు చేస్తూ, విచారణ జరుపుతున్నారని ఆరోపించాడు. అనంతరం అతను విలేఖరులతో మాట్లాడుతూ విచారణకు బ్లాటర్ సంపూర్ణంగా సహకరించాడని చెప్పాడు. న్యాయమూర్తులు తమ వివరణను సావకాశంగా విన్నారని, త్వరలోనే బ్లాటర్‌ను నిర్దోషిగా పేర్కొంటూ, అతనిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నాడు.
ముందుగానే నిర్ణయాలు
సస్పెన్షన్‌కు గురైన, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఫిఫా ఎథిక్స్ కమిటీ కోర్టు ముందుగానే నిర్ణయాలు తీసుకుందా? విచారణ నామమాత్రమేనా? అవునని అంటున్నాడు సస్పెన్షన్‌కు గురైన ఫిఫా ఉపాధ్యక్షుడు, యూరోపియన్ యూనియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (యూఫా) అధ్యక్షుడు ప్లాటినీ. శిక్షలను ముందుగానే ఖరారు చేసుకొని, ఎథిక్స్ కమిటీ విచారణ పేరుతో అందరినీ మభ్యపెడుతున్నదని ఒక ప్రకటనలో ఆరోపించాడు. విశ్వసనీయతలేని విచారణకు హాజరుకావాల్సిన అవసరం తనకు లేదన్నాడు. అయితే, తన అభిప్రాయాన్ని, వాదనను తన తరఫున వాదిస్తున్న లాయర్ ఇప్పటికే న్యాయమూర్తులకు తెలియచేశాడని అన్నాడు. ఎథిక్స్ కోర్టు ఇచ్చే తీర్పు వెలువడిన తర్వాత క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్)ను ఆశ్రయించాలా లేదా అన్న విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు.
ఎన్నో సవాళ్లు: హయాటో
తమ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని ఫిఫా తాత్కాలిక అధ్యక్షుడు ఇసా హయాటో అన్నాడు. భారీగా ముడుపులు స్వీకరించి 2018లో రష్యాకు, 2022లో కతార్‌కు ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ నిర్వాహణ హక్కులను ధారాదత్తం చేశారని పలువురు పిఫా అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్న అమెరికా నిఘా విభాగం సూచనల మేరకు జ్యూరిచ్ అధికారులు ఇప్పటికే 19 మందిని అరెస్టు చేశారు. కాగా, స్విట్జర్లాండ్‌లోని 50 ఖాతాలను కూడా స్తంభింప చేశామని హయాటో తెలిపాడు. అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం తదితర ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలు విచారణలో వెల్లడవుతాయని అతను చెప్పాడు. ఫిఫాకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి జరగాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో సవాళ్లను అధిగమిస్తేగానీ లక్ష్యాన్ని చేరడం సాధ్యం కాదని అన్నాడు.