క్రీడాభూమి

జేమ్స్ ఆండర్సన్ ‘సాన్‌టినా’ నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ నుంచి సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ నిష్క్రమించింది. మూడో రౌండ్‌లో బార్బొరా క్రెజిసికొవా, కాతెరీన సింజకొవా జోడీతో తలపడిన వీరు 3-6, 2-6 తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ సీజన్‌లో మరో టైటిల్‌పై కనే్నసిన ‘సాన్‌టినా’ జోడీ క్వార్టర్ ఫైనల్స్ చేరకుండానే ఓటమిపాలుకావడం అభిమానులను నిరాశకు గురి చేసింది. కాగా, సానియా పోరాటం మిక్స్‌డ్ డబుల్స్‌లో కొనసాగుతుంది. ఇవాన్ డోడింగ్‌తో కలిసి ఈ విభాగంలో పోటీపడుతున్న ఆమె రెండో రౌండ్‌లో ఎలిజా కార్నెట్, జొనథాన్ ఎసెరిక్ జోడీతో తలపడనుంది. వర్షం కారణంగా పలు మ్యాచ్‌లు వాయిదా పడడంతో, సానియా, డోడింగ్ జోడీకి ఆటవిడుపు లభించింది.
రోజర్స్ సంచలనం
అమెరికాకు చెందిన 23 ఏళ్ల షెల్బీ రోజర్స్ కూడా మొట్టమొదటి సారి ఒక గ్రాండ్ శ్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ చేరి సంచలనం సృష్టించింది. యుఎస్ ఓపెన్‌లో అమె అత్యుత్తమంగా మూడో రౌండ్ చేరగా, ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్ టోర్నీల్లో మొదటి రౌండ్‌ను దాటలేదు. పురుషుల సింగిల్స్‌లో రిచర్డ్ గాస్క్వెట్ మాదిరినేగా మహిళల విభాగంలో రోజర్స్ అనూహ్యంగా క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టి క్రీడా పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ టోర్నీలో అడుగుపెట్టినప్పుడు ఆమెను ఎవరూ ఒకటిరెండు రౌండ్ల కంటే ముందుకు వెళుతుందని అనుకోలేదు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ దూసుకెళ్లిన ఆమె సెమీస్‌లో స్థానం కోసం గార్బినె ముగురుజాతో తలపడుతుంది. ప్రీ క్వార్టర్స్‌లో ఆమె ఇరినా కామిల్లా బెగూను 6-3, 6-4 తేడాతో ఓడించింది.