క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్‌ను వీడని వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 31: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌ను వర్షం వెంటాడుతునే ఉంది. సోమవారం వర్షం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. 16 ఏళ్ల కాలంలో ఈ విధంగా ఒక రోజు జరగాల్సిన మ్యాచ్‌లన్నీ రద్దు కావడం ఇదే మొదటిసారి. కాగా, మంగళవారం కూడా వర్షం బెడద కొనసాగింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధ రాత్రి వరకూ మ్యాచ్‌లు మొదలుకాలేదు. వర్షం తగ్గిన వెంటనే విరామం లేకుండా మ్యాచ్‌లను నిర్వహించి, టోర్నీని సకాలంలో పూర్తి చేయించడానికి నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.
ఇలావుంటే, మహిళల సింగిల్స్‌లో సిమోనా హాలెప్, అగ్నిస్కా రద్వాన్‌స్కా పరాజయాలను చవిచూసి నిష్క్రమించడం అందరినీ ఆశ్చర్యాని కి గురి చేస్తున్నది. ఆస్ట్రేలియాకు చెందిన వెటరన్ క్రీడాకారిణి సమంతా స్టొసుర్ 7-6, 6-3 తేడాతో హాలెప్‌ను ఓడించింది. మరో మ్యాచ్‌లో స్వెతానా పిరిన్కొవా 2-6, 6-3, 6-3 ఆధిక్యంతో అగ్నీస్కా రద్వాన్‌స్కాపై విజయం సాధించింది. సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్‌తోపాటు పలువు రు స్టార్ క్రీడాకారులు పాల్గొనాల్సిన మ్యాచ్‌లు వర్షం కారణంగా మొదలుకాలేదు.