క్రీడాభూమి

ఓ ప్రాణాన్ని బలిగొన్న నోబాల్ నిర్ణయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలీగఢ్, మే 31: నోబాల్ నిర్ణయం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. ఒక బంతిని నోబాల్‌గా ప్రకటించినందుకు ఓ అంపైర్ తన సోదరిని కోల్పోయాడు. అలీగఢ్‌లో జరారా, బరికి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కి రాజ్ కుమార్ అంపైర్‌గా వ్యవహరించాడు. ఒక బౌలర్ వేసిన బంతిని అతను నోబాల్‌గా ప్రకటించాడు. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా సందీప్ పాల్ అనే ఆటగాడు చేసిన విజ్ఞప్తిని రాజ్ కుమార్ తిరస్కరించాడు. దీనితో అతనిపై ఆగ్రహం పెంచుకున్న సందీప్ పాల్ అదను కోసం ఎదురుచూశాడు. రాజ్ కుమార్ సోదరి పూజ తన స్నేహితురాళ్లతో కలిసి వెళుతున్నప్పుడు కూల్ డ్రింక్ తాగాల్సిందిగా వారిని ఆహ్వానించాడు. మాగా తెలిసిన వ్యక్తి కావడంతో పూజ, ఆమె ఫ్రెండ్స్ అతను ఇచ్చిన కూల్ డ్రింక్స్‌ను తాగారు. అయితే, అందులో విషం కలపడంతో వారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని ఆసుప్రతికి తరలించగా, పూజ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. మిగతా వారికి చికిత్స జరుపుతున్నట్టు తెలిపారు.