క్రీడాభూమి

అగర్వాల్ అ‘ద్వి’తీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం : దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్లు అదరగొట్టారు. ఓవర్ నైట్ స్కోర్ 202 పరుగులతో రెండో రోజు గురువారం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ఎలాంటి అవకాశమివ్వకుండా ఆడింది. ఈ క్రమంలో టెస్టులో యువ బ్యాట్స్‌మన్ మాయాంక్ అగర్వాల్ 69వ ఓవర్లో 2 బంతికి సింగిల్ తీసి టెస్టుల్లో తొలి సెంచరీని సాధించాడు. మరోవైపు రోహిత్ శర్మ 150 పరుగులు చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రోహిత్ శర్మ (176) మహరాజ్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. అయతే అనూహ్యాంగా బంతి తిరగడంతో స్టంప్ అవుట్‌గా వెనుదిరి, త్రుటిలో డబుల్ సెంచరీ సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 317 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (6), కెప్టెన్ విరాట్ కోహ్లీ (20) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. దీంతో భారత్ 377 పరుగులకే 3 వికెట్లు కోల్పోయంది. ఓవైపు వికెట్లు పడుతున్నా, అప్పటికే డబుల్ సెంచరీకి చేరువైన మాయాంక్ అగర్వాల్ మాత్రం తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పెంచే బాధ్యత తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తొలి డబుల్ సెంచరీ సాధించాడు. మరోవైపు అజింక్యా రహానే (15) నెమ్మదిగా ఆడే ప్రయత్నం చేసినా మహరాజ్ బౌలింగ్‌లో బవుమాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మాయాంక్ అగర్వాల్ (215) కూడా ఎల్గర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అప్పటికీ భారత్ 5 వికెట్లు కోల్పోయ 436 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. ఇక రవీంద్ర జడేజా (30, నాటౌట్) ఫర్వాలేదనిపించినా, హనుమ విహారి (10), వృద్ధిమాన్ సాహా (21) విఫలం కాగా, రవిచంద్రన్ అశ్విన్ (1, నాటౌట్) క్రీజులో ఉండగా 502/7 పరుగుల వద్ద భారత జట్టు డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ 3 వికెట్లు తీయగా, వెర్నర్ ఫీలాండర్, డానె పిడ్ట్, సినారన్ ముత్తుస్వామి, డీన్ ఎల్గర్ తలో వికెట్ పడగొట్టారు.
ఆదిలోనే దెబ్బ..
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 14 పరుగుల వద్ద ఓపెనర్ అయడేన్ మార్కరమ్ (5) అశ్విన్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన థీనస్ డీబ్రయన్ (4), డానె పిడ్ట్ (0) కూడా అవుటవడంతో దక్షిణాఫ్రికా 39 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయ కష్టాల్లో పడింది. అప్పటికీ సమయం ముగియడంతో రెండో రోజు ఆటను ముగించారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీసుకున్నాడు.
స్కోర్ బోర్డు:
భారత్ తొలి ఇన్నింగ్స్: మాయాంక్ అగర్వాల్ (సీ) పిడ్ట్ (బీ) ఎల్గర్ 215, రోహిత్ శర్మ (స్టంప్) డీకాక్ (బీ) మహారాజ్ 176, చతేశ్వర్ పుజారా (బీ) ఫీలాండర్ 6, విరాట్ కోహ్లీ (సీ, బీ) సినారన్ ముత్తుస్వామి 20, అజింక్యా రహానే (సీ) బవుమా (బీ) మహారాజ్ 15, రవీంద్ర జడేజా (నాటౌట్) 30, హనుమ విహారి (సీ) ఎల్గర్ (బీ) మహారాజ్ 10, వృద్ధిమాన సాహా (సీ) సినారన్ ముత్తుస్వామి (బీ) పిడ్ట్ 21, రవిచంద్రన్ అశ్విన్ (నాటౌట్) 1. ఎక్స్‌ట్రాలు: 8 మొత్తం: 502 డిక్లేర్ (136 ఓవర్లలో 7 వికెట్లకు..)
వికెట్ల పతనం: 1-317, 2-342, 3-377, 4-431, 5-436, 6-457, 7-494
బౌలింగ్: వెర్నర్ ఫీలాండర్ 22-4-68-1, కగిసో రబద 24-7-66-0, కేశవ్ మహారాజ్ 55-6-189-3, డానె పిడ్ట్ 19-1-107, 1, సినారన్ ముత్తుస్వామి 15-1-63-1, డీన్ ఎల్గర్ 1-0-4-1
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: డీన్ ఎల్గర్ (బ్యాటింగ్) 27, అయడేన్ మార్కరమ్ (బీ) అశ్విన్ 5, థీనస్ డీబ్రయన్ (సీ) సాహా (బీ) అశ్విన్ 4, డానె పిడ్ట్ (బీ) రవీంద్ర జడేజా 0, టెంబ బవుమా (నాటౌట్) 2.
ఎక్స్‌ట్రాలు: 1 మొత్తం: 39 డిక్లేర్ (20 ఓవర్లలో 3 వికెట్లకు..)
బౌలింగ్: ఇషాంత్ శర్మ 2-0-8-0, మహ్మద్ షమీ 2-2-0-0, రవిచంద్రన్ అశ్విన్ 8-4-9-2, రవీంద్ర జడేజా 8-1-21-1.
*చిత్రం... డబుల్ సెంచరీ హీరో మాయాంక్ అగర్వాల్