క్రీడాభూమి

బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌కు వెస్ట్‌వుడ్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 31: ఐ-లీగ్ చాంపియన్ బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ చీఫ్ కోచ్ ఆష్లే వెస్ట్‌వుడ్ గుడ్‌బై చెప్పాడు. సపర్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బెంగళూరు యాజమాన్యం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అతనితో క్లబ్ కుదుర్చుకున్న మూడేళ్ల కాంట్రాక్టు కాలం ముగిసిందని పేర్కొంది. గత మూడేళ్ల కాలంలో రెండు పర్యాయాలు ఐ-లీగ్‌లో బెంగళూరును విజేతగా నిలిపిన వెస్ట్‌వుడ్ సమర్థుడైన కోచ్‌గా పేరు సంపాదించాడు. అతని హయాంలోనే, 2014లో బెంగళూరు ఫెడరేషన్ కప్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో వెస్ట్‌వుడ్ కాంట్రాక్టును బెంగళూరు ఎఫ్‌సి మరో మూడేళ్లు పొడిగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, అతను క్లబ్‌ను వీడుతున్నట్టు ప్రకటన వెలువడడంతో, కారణాలు ఏమిటనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.