క్రీడాభూమి

బౌలింగ్‌లో మళ్లీ లయ దొరికింది : అశ్విన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం అక్టోబర్ 4: జట్టులో తిరిగి స్థానం దక్కించుకుని బౌలింగ్‌లో రాణించడం ఆనందంగా ఉందని భారత్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు అశ్విన్ కీలకమైన 3 వికెట్లు, మొత్తం 5 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన అశ్విన్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి క్రికెట్ ఆడి నిలదొక్కుకోవడం తనకు ముఖ్యమన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. మూడో రోజు ఆట అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ పిచ్ బౌ లర్లకు అనుకూలించట్లేదు అన్న ప్రశ్నకు సమాధానంగా టెస్టు మ్యాచ్‌లకు తగిన విధంగానే పిచ్ ఉందని, దక్షిణాఫ్రికా జట్టు 385 పరుగులు చేయడం ఎల్గర్, డికాక్, డుప్లిసెస్ బ్యాటింగ్ సామర్థ్యమే తప్ప మరోటి కాదని, పూర్తిగా ఆ క్రెడిట్ వారికే దక్కుతుందన్నాడు. క్రికెట్‌ను తాను ఎంతో ఆస్వాదిస్తానని, తిరిగి జట్టులో స్థానం దక్కించుకోవడం తనకెంతో ప్రత్యేకమైందిగా పేర్కొన్నాడు. డుప్లిసెస్, ఎల్గర్ చక్కగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భోజన విరా మ సమయంలో ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా అన్న ప్రశ్నకు సమాధానంగా అటాకింగ్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో వారు ముగ్గురు చక్కగా రాణించారని ప్రశంసించాడు.