క్రీడాభూమి

సఫారీలదే మూడో రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 4: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో సఫారీలు దీటుగా బదులి స్తున్నారు. ఓవర్ నైట్ స్కోరు 39 పరుగులతో మూడో రోజు శుక్రవారం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఓపెనర్ డీన్ ఎల్గర్, క్వింటన్ డికాక్ అద్భుత సెంచలకు తోడు, కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ రాణించారు. టెంబ బవుమా (18)ను ఇషాంత్ శర్మ తొందరగానే పెవిలియన్‌కు పంపినా, ఆ తర్వాత డుప్లెసిస్‌తో కలిసి ఎల్గర్ పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధ సెంచరీలు సాధించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే డుప్లెసిస్ (55) అశ్విన్ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐదో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 115 పరుగుల భాగస్వామ్యాన్ని జట్టుకు అందించారు. మరోవైపు క్రీజులోకి వచ్చిన డికాక్ సాయంతో ఎల్గర్ సెంచరీ సాధించాడు. మరోవైపు అప్పటి వరకు ఆచితూచి ఆడిన డికాక్ క్రీజులో కుదురుకున్నాక బౌండరీలతో చెలరేగి అర్ధ సెంచరీ సాధించగా, ఎల్గర్ 150 పరుగుల మార్క్‌ను దాటాడు. అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రవీంద్ర జడేజా విడదీశాడు. 100వ ఓవర్‌లో మూడో బంతికి డీన్ ఎల్గర్ (160) పుజారాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికీ ఎల్గర్, డికాక్ జోడీ 164 పరుగుల భాగస్వామ్యం అందించింది. ఈ దశలో సెంచరీ సాధించిన క్వింటన్ డికాక్ (111) కొద్దిసేపటికే అశ్విన్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికీ దక్షిణాఫ్రికా 7 వికెట్లు కోల్పోయ 370 పరుగులు చేసింది. ఆ తర్వత వచ్చిన వెర్నర్ ఫిలాండర్ (0)ను అవుట్ చేసిన అశ్విన్ తన ఖాతాలో 5వికెట్లను వేసుకున్నాడు. అప్పటికీ సమయం దగ్గరపడడంతో అంపైర్లు మూడో రోజు ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు. సినారన్ ముత్తుస్వామి (12, నాటౌట్), కేశవ్ మహారాజ్ (3, నాటౌట్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో రవించంద్రన్ అశ్విన్ 5 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా 2, ఇషాంత్ శర్మ, ఒక వికెట్ పడగొట్టారు.
జడేజా 200
ఈ టెస్టులో టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో 200 వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు. 99.3 ఓవర్‌లో డీన్ ఎల్గర్‌ను పెవిలియన్‌కు పంపిన జడేజా అతి తక్కువ టెస్టుల్లో ఎడమ చేతి వాటం బౌలర్లలో ఈ ఫీట్‌ను చేరుకున్న మొదటి బౌలర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరుఫును వేగంగా 200 వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా ఘనత సాధించాడు. జడేజా కంటే ముందు రవిచంద్రన్ అశ్విన్ 37 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఎడమ చేతి వాటం బౌలర్లలో జడేజా తర్వాత శ్రీలంక బౌలర్ రంగన హేరాత్ (47), ఆస్ట్రేలియా మాజీ బౌలర్ మిచెల్ జాన్సన్ (49) ఉన్నారు.
స్కోర్ బోర్డు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 502/7 డిక్లేర్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: డీన్ ఎల్గర్ (సీ) పుజారా (బీ) రవీంద జడేజా 160, అయడెన్ మార్కరమ్ (బీ) అశ్విన్ 5, థీనస్ డీబ్రైన్ (సీ) సాహా (బీ) అశ్విన్ 4, డీన్ పీడ్త్ (బీ) రవీంద్ర జడేజా 0, టెంబ బవుమా (ఎల్‌బీడబ్ల్యూ) (బీ) ఇషాంత్ 18, ఫఫ్ డుప్లెసిస్ (సీ) పుజారా (బీ) అశ్విన్ 55, క్వింటన్ డికాక్ (బీ) అశ్విన్ 111, సినారన్ ముత్తుస్వామి (బ్యాటింగ్) 12, వెర్నర్ ఫిలాండర్ (బీ) అశ్విన్ 0, కేశవ్ మహారాజ్ (బ్యాటింగ్) 3, ఎక్స్‌ట్రాలు: 17, మొత్తం: 385 (118 ఓవర్లలో 8 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-14, 2-31, 3-34, 4-63, 5-178, 6-342, 7-370, 8-376
బౌలింగ్: ఇషాంత్ శర్మ 14-2-44-1, మహ్మద్ షమీ 15-3-40-0, రవిచంద్రన్ అశ్విన్ 41-11-128-5, రవీంద్ర జడేజా 37-4-116-2, హనుమ విహారి 9-1-38-0, రోహిత్ శర్మ 2-1-7-0.