క్రీడాభూమి

క్వార్టర్ ఫైనల్‌కు భారత బాక్సర్ మంజురాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉలాన్-ఉడే (రష్యా), అక్టోబర్ 7: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల 48 కిలోల విభాగంలో భారత బాక్సర్ మంజురాణి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించారు. చివరి 16వ స్టేజీలో తలపడిన ఈ ఆరో సీడ్ భారతీయ మహిళ 5-0 స్కోరుతో వెనిజులాకు చెందిన రోజాస్ టయోనిస్ సిడెనోను మట్టికరిపించింది. విశ్వవిఖ్యాత వేదకపై తొలి ప్రయత్నంలోనే పతకాన్ని కైవసం చేసుకునే అవకాశం ఆమెకు ఇక కేవలం ఒక విజయానికి దూరంలో ఉంది. ఐతే తదుపరి ఆమె ఎదుర్కోబోతున్న ప్రత్యర్థితో క్లిష్టతర పోటీ ఉంటుందని క్రీడాపండితులు పేర్కొంటున్నారు. గత ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న దక్షిణ కొరియాకు చెందిన కిమ్ హయాంగ్ మీతో క్వార్టర్ ఫైనల్స్‌లో మంజురాణి తలపడబోతోంది. ఈ ఇద్దరు బాక్సర్లు రక్షణాత్మక తీరును ప్రదర్శించడంలో దిట్టలే అయినప్పటికీ మంజురాణి ఆటతీరు వినిన్నంగా ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఏడాది బల్గేరియాలో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో రజత పతకాన్ని గెలుచుకుంది. మరొక్క మ్యాచ్‌లో విజయం సాధిస్తే కనీసం కాంస్య పతకాన్ని మంజురాణికి ఖాయం అయ్యే అవకాశం ఉంటుంది

*చిత్రం...ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో జరిగిన పోటీలో వెనెజులా బాక్సర్ రోజాస్ టెనోయిస్ టెడెనోపై పంచ్ విసురుతున్న భారత బాక్సర్ మంజురాణి.