క్రీడాభూమి

ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ సైనా శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, మే 31: ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియం బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ హైదరాబాదీ మొదటి రౌండ్‌లో 23వ ర్యాంకర్ పాయ్ యూ పోను 21-11, 19-21, 21-15 తేడాతో ఓడించింది. గతంలో మూడు పర్యాయాలు ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ఆమె రెండో రౌండ్‌లో స్థానిక క్రీడాకారిణి ఫిట్రియానితో తలపడుతుంది. మరో మొదటి రౌండ్ మ్యాచ్‌లో ఫిట్రియాని 21-11, 13-21, 21-15 స్కోరుతో గ్రెగొరియా మరిస్కా తున్‌జంగ్‌పై విజయం సాధించింది. కాగా, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. మను అత్రి, అశ్వినీ పొన్నప్ప జోడీ 14-21, 25-27 తేడాతో యాంగ్ కెయ్ టెర్రీ హీ, వెయ్ హాన్ తాన్ జోడీ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని, మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించింది.