క్రీడాభూమి

రవిశాస్ర్తీ బృందం తాజా దరఖాస్తులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: టీమిండియా డైరెక్టర్ రవి శాస్ర్తీ, అసిస్టెంట్ కోచింగ్ స్ట్ఫా సంజయ్ బంగార్, భరత్ అరుణ్, ఆర్. శ్రీ్ధర్ తమతమ పదవులు నిలబెట్టుకోవడానికి మళ్లీ దరఖాస్తులు పెట్టుకున్నారు. భారత క్రికెట్ జట్టుకు డైరెక్టర్‌గా రవి శాస్ర్తీ పదవీకాలం ఇటీవలే ముగిసింది. బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్‌గా సంజయ్ బంగార్, ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీ్ధర్ వ్యవహరిస్తున్నారు. వీరి కాంట్రాక్టు కూడా ముగింపు దశకు చేరుకోవడంతో, ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఒక ప్రకటన ఇచ్చింది. రవి శాస్ర్తీతోపాటు బంగార్, భరత్, శ్రీ్ధర్ కూడా తమ దరఖాస్తులను పంపారని బిసిసిఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలే బిసిసిఐకి అధ్యక్షుడిగా ఎన్నికై అనురాగ్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో టీమిండియా సపోర్టింగ్ స్ట్ఫా గురించి ఘనంగా చెప్పాడు. వారి కృషిని ప్రశంసించాడు. టీమిండియా సాధించిన పలు విజయాల్లో వీరు కీలక పాత్ర పోషించారని అన్నాడు. రవి శాస్ర్తీ, మిగతా ముగ్గురి పట్ల బిసిసిఐ సానుకూలంగా ఉందని ఠాకూర్ వ్యాఖ్యలు స్పష్టం చేశాయి. అందుకే, ఖరారు చేసిన దరఖాస్తు ఫారాలను వారు బోర్డుకు పంపించారని తెలుస్తోంది. ఇప్పటికే బిసిసిఐ వ్యవహార శైలితోపాటు, లోధా కమిటీ సిఫార్సుల అమలు వంటి పలు అంశాలపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నది. చాలా సందర్భాల్లో బిసిసిఐకు కోర్టు చీవాట్లు పెట్టింది. దీనితో బోర్డు పాలనా వ్యవహారాలను పారదర్శకంగా ఉంచాలనే ఉద్దేశంతో, నియామకాలపై బిసిసిఐ స్పష్టతనిచ్చింది. ఏ పోస్టుకైనా, ఎవరైనా నిర్ణీత ఫారాల్లోనే దరఖాస్తు చేసుకోవాలని తేల్చిచెప్పింది. దీనితో పదవులు నిలవాలంటే దరఖాస్తు చేసుకోని పరిస్థితి తలెత్తడంతో రవి శాస్ర్తీ తదితరులు ఆగమేఘాలపై దరఖాస్తులు పంపారు. టీమిండియా డైరెక్టర్‌గా రవి శాస్ర్తీ 18 నెలల కాంట్రాక్టును ఇటీవలే పూర్తి చేసిన విషయం తెలిసిందే.

chitram రవి శాస్ర్తీ,భరత్ అరుణ్