క్రీడాభూమి

ఈడెన్ గార్డెన్స్ మాజీ క్యూరేటర్ ప్రబీర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 1: క్రికెట్ మైదానాల గురించి, అందులోనూ అత్యంత ప్రతిష్టాత్మకమైన కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ ప్రబీర్ ముఖర్జీ పేరు సుపరచితం. వృత్తి ధర్మానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఎవరి మాటనూ లెక్కచేయని విలక్షణ వ్యక్తిగా ముద్రపడిన ఈడెన్ గార్డెన్స్ మాజీ క్యూరేటర్ ప్రబీర్ మృతి చెందారు. 86 ఏళ్ల ప్రబీర్ కొంత కాలంగా ఉదర కోశ సంబంధమైన వ్యాధితో బాధపడుతూ బిఎన్‌ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన మనవడు ప్రణయ్ ముఖర్జీ పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. బుధవారం ఉదయం ఆయన మృతి చెందారని తెలిపాడు. రెండు దశాబ్దాలకుపైగా ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్‌గా సేవలు అందించిన ప్రబీర్ నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. 1987 వరల్డ్ కప్ ఫైనల్ ఈడెన్ గార్డెన్స్‌లో జరిగినప్పుడు ఆయన పర్యవేక్షణలోనే పిచ్ రూపుదిద్దుకుంది. 2015 అక్టోబర్ 8న ఇదే మైదానంలో దక్షిణాఫ్రికాతో భారత్ టి-20 మ్యాచ్ ఆడాల్సి ఉండగా, సకాలంలో పిచ్‌ని సిద్ధం చేయలేదని ప్రబీర్‌పై విమర్శలు వచ్చాయి. ఆ రోజు మధ్యాహ్నం వర్షం పడితే, ఆరు గంటల తర్వాత కూడా పిచ్‌ని తయారుగా ఉంచకపోవడంతో మ్యాచ్ రద్దయింది. అంతకు ముందే రెండు మ్యాచ్‌లను గెల్చుకున్న దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించే అవకాశం ప్రబీర్ వల్ల చేజారిందని పలువురు విమర్శలు గుప్పించారు. ఈ సంఘటన తర్వాత ప్రబీర్ క్యూరేటర్‌గా బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆతర్వాత కొద్దికాలానికే ఆయన ఆరోగ్యం దెబ్బతింది. కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు.

బిసిసిఐ తొలి సిఇవోగా
జోహ్రి బాధ్యతల స్వీకారం
ముంబయి, జూన్ 1: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సిఇవో)గా రాహుల్ జోహ్రి బుధవారం బాధ్యతలు స్వీకరించాడు. పలువురు అధికారులు అతనికి సాదర స్వాగతం పలికారని బిసిసిఐ ట్విటర్‌లో పేర్కొంది. బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌కు అతను ఎప్పటికప్పుడు నివేదికలను అందిస్తాడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ హోదాలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి బిసిసిఐ అధికారులను తరచు సంప్రదించి, సూచనలు, సలహాలు తీసుకుంటాడు. చాలా దేశాల్లో క్రికెట్ సంఘాలకు సిఇ వోలు ఉంటారు. ఇన్నాళ్లకు సిఇవో ఆవస్యకతను బిసిసిఐ గుర్తించి, జోహ్రిని నియమించింది. ఇటీవ ల కాలంలో బిసిసిఐపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు.
ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్
సౌరభ్ ఓటమి
జకార్తా, జూన్ 1: ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లోనే భారత ఆటగాడు సౌరభ్ వర్మ ఓటమిపాలై నిష్క్రమించాడు. టాప్ ర్యాంకర్ లీ చాంగ్ వెయ్‌తో తలపడాల్సి వచ్చిన అతను 11-21, 13-21 తేడాతో పరాజాన్ని చవిచూశాడు. మహిళల డబుల్స్‌లో జ్వాలా గుత్తా, అశ్వినీ పొన్నప్ప జోడీ 21-7, 20-22, 21-10 ఆధిక్యంతో ఫాబ్రియానా కుసుమ, రిబ్కా సుగియార్తో జోడీపై విజయం సాధించి రెండో రౌండ్ చేరింది.